Saturday, September 14, 2013

ఆర్య, నయన్ పెళ్లి చేసుకున్నారట..!

'నయనతార', 'ఆర్య' జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'రాజా రాణి'. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. సినిమాను తమిలంతో పాటు ఇతర భాషల్లో
కూడా ఈనెల 27 లేదా 29న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. ఆర్య, నయన్ ల పెళ్లి వార్తలు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటూ గతంలో మీడియా నానా హడావుడి చేసింది. అయితే ఈ సారి నిజంగానే ముహూర్తం సెట్ చేసుకున్నారు. కాకపోతే ఇది సినిమాలో. 'రాజా రాణి' చిత్రంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుని కొన్ని సమస్యలతో విడిపోయే పాత్రలో నటిస్తున్నారు.  అంతకు ముందు నిజ జీవితంలో వీరిద్దరు కొన్ని రోజులు ప్రేమాయణం నడిపించి విడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్యతో ప్రేమాయణం నడుపుతోందనే వార్తలు కోలీవుడ్ లో షికార్లు చేస్తున్నాయి. అయితే ఆర్య.. అనుష్కతో ప్రేమలో పడ్డాడనే వార్తలు రావడంతో వీటికి ఫుల్ స్టాప్ పడింది.

No comments:

Post a Comment