టాలీవుడ్ 'బాద్ షా' జూ.ఎన్టీఆర్ అభిమానులకు సెగలు పుట్టించేలా.. ఇక అంతా రణ చదరంగం జరగాల్సిందే అంటున్నాడు.
ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో
తెరకెక్కుతోన్న చిత్రం 'రామయ్యా
వస్తావయ్యా'. ఎన్టీఆర్ కు జంటగా సమంతా, శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఎంతో
కాలంగా ఎదురు చూసున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈ నెల 27న జరగనుంది. అయితే
చిన్న వయసులోనే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ యాక్షన్ లో,
డ్యాన్స్ లో దుమ్ము రేపుతున్నాడీ 'యంగ్ టైగర్'. డైలాగులు చెప్పడంలో తాతకు
తగ్గ మనుమడనిపించుకున్నాడు. అయితే ఈ మధ్య మన 'బుడ్డోడి'కి రేంజ్ కు తగ్గ
హిట్ లేదు.ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'రామయ్యా వస్తావయ్యా'లోని కొన్ని స్టిల్స్ అభిమానులకు సెగలు పుట్టిస్తున్నాయి. 'ఆది', 'సింహాద్రి' రేంజ్ లో ఎన్టీఆర్ మోస్ట్ పవన్ ఫుల్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. ఇక గొడ్డలిపట్టుకుని విలన్లను వేటాడుతున్నట్టున్న ఈ సీన్ తో పాటు వెనక 'రణరంగం.. రణ చదరంగం జరగాల్సిందే శర విధ్వంసం..' అనే పవర్ ఫుల్ పాట కూడా వినిపిస్తుందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ తో పాటు, డైలాగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయట. దీంతో 'రామయ్యా వస్తావయ్యా' కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . మరి ఎన్టీఆర్ ఎన్ని బాక్సాఫీస్ లను షేక్ చేస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగల్సిందే.

No comments:
Post a Comment