తెలుగు సినిమాల్లో హీరోలంటే..విలన్ ను గాల్లోకి ఎగరేసి గోటితో చంపేయాలి. చూపులతోనే నలుగురిని నరికేయాలి. హీరోయిన్ ని ప్రేమలోకి దించాలి. కాదన్న వాడిని ఖతం చేయాలి. ఇప్పటి దాకా టాలీవుడ్
లో కనిపిస్తున్న హీరో క్యారెక్టర్ ఇది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. సినిమాల్లో పంచ్ డైలాగులతో పాటు నిజ జీవితంలోనూ డైలాగ్స్ తో దుమ్ము రేపుతున్నారు మన నాయకులు. అయితే ఈ 'డైలాగ్స్' వల్ల ఆ హీరోల మధ్యే కాదు.. వారి అభిమానుల మధ్య కూడా చిచ్చు రేగుతోంది.
'దమ్మున్న వాడు నరకాల్సింది వెనుక నుంచి కాదు. దమ్ముంటే ముందు నుంచి నరకాలి'. ''ఏదైన ఒక్కడితోనే మొదలవుతోంది''.. 'వాడి బాడీ బ్లెడ్ తో కాదు.. పగతో రన్ అవుతోంది''. ''ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే బుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి.. లేదా నా అభిమానైన ఉండాలి''. ఇవి టాలీవుడ్ అగ్రహీరోలు వారి సినిమాలో వాడే డైలాగ్ లు. ఇవి సినిమాకు బాగానే ఉన్నా.. నిజ జీవితంలో హీరోల అభిమానులల్లో చిచ్చు పెడుతున్నాయి. ఈ డైలాగ్ లు తమ హీరోని తిట్టునట్టున్నాయని వారి అభిమానులు గొడవలకు పోతున్నారు. దీనితో ఆగకుండా కొందరు అభిమానులు ఆత్మహత్యల వరకు వెళ్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ ను ఇబ్బందిని పెట్టే అంశం.. హీరోలు తమ ప్రయోజనాలకోసం, సినిమా ప్రమోషన్ కోసం పంచ్ డైలాగ్ లతో చేస్తున్న హడావుడిలో అభిమానుల మధ్య చిచ్చు పెడుతుందనే విషయం సినీ వర్గాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రమోషన్ ఉంటేనే సినిమా క్లిక్ అవుతుంది. ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోతాయి. కానీ చిచ్చు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీపై ఉంది.
సినిమాల్లో ఏ హీరో ఎలాంటి డైలాగ్ వాడుతున్నాడు.. అవి ఎలా గొడవలకు కారణమయ్యాయనే విషయం మన ఈ ట్రెండ్ గురులో తెలుసుకుందాం..
నందమూరి, మెగా హీరోల మధ్య డైలాగ్స్ వార్..
'బాలయ్య' పని అయిపోయింది, ఇక ఇంటికెళ్లాల్సిందే అని క్రిటిక్స్ అంతా పోస్టింగ్ ల మీద పోస్టింగ్ లు చేస్తున్న టైంలో వాళ్లందరికి సమాధానంగా.. రికార్డ్ హిట్ ఇచ్చిన సినిమా 'సింహా'. అసలు బాలకృష్ణ కెరీర్ లోనే ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్స్ కలెక్ట్ చేసింది 'సింహా'. దీనిలో వాడిన డైలాగ్ లు అటు పోలీసులనూ.. ఇటు ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ కుటుంబానికి విమర్శించినట్టుంది. ఇది అభిమానులను కొంత ఇబ్బందే పెట్టింది. ఇక నందమూరి నటవారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పంచ్ పలక్ నామాల లిస్ట్ లో జాయిన్ అయిపోయాడు. డైలాగ్స్ ని డైనమైట్ లా పేల్చే తారక్ 'బుడ్డోడు' డైలాగ్ తో వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ ట్రైలర్ కౌంటర్ లా ఉందని, ఉద్దేశ్యపూర్వకంగానే ఈ డైలాగ్స్ వాడాడాని ఓ హీరో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారట. అంతేకాదు ఓవర్ యాక్షన్ లో డబుల్ పీజి చేసినవాడిలా యాక్ట్ చేశాడు అని రామయ్య ట్రైలర్ కి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారట.
వేదికలపై వివాదస్పద డైలాగ్..
తెలుగు సినిమా 75 వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తెలుగు సినీపరిశ్రమ ఎంతో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకల్లో భారీ అద్భుతాలే జరిగాయి. తెలుగు సినిమాని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్లాల్సిన నటులు వారి చేతలతో పాతాళానికి పడేశారు.
ఎలాంటి సందర్భంలో నైనా అవలీలగా, అదరిపోయే రేంజ్ లో డైలాగ్ చెప్పే 'డైలాగ్ కింగ్ మోహన్ బాబు'. ఎలాంటి డైలాగ్స్ నైన డైనమెట్స్ లా పేల్చే మోహన్ బాబు వజ్రోత్సవంలో కూడా అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. కానీ ఆ అదరొట్టడంలోనే హుషారు ఎక్కువై, స్పీచ్ శ్రుతి మించింది. మంచు బాబుకి, 'మెగానాయకుని'కి మధ్య గొడవలు సృష్టించింది. మోహన్ బాబు 'చిరంజీవి'పై సెటైర్ వేస్తే, 'పవన్ కళ్యాన్' మోహన్ బాబుకి కౌంటర్ ఇచ్చాడు. ఈ కౌంటర్ లు అభిమానుల మధ్య గొడవలు సృష్టించాయి. మంచు అభిమానులు, మెగాఫ్యాన్స్ గొడవలకు కారణమయ్యాయి.
దర్శకుల్లోనూ ఇదే తంతూ..
సూపర్ హిట్ ఫిల్మ్ స్ తో టాలీవుడ్ లో 'దర్శకరత్న' అయ్యాడు 'దాసరి నారాయణ'. ఒక పెద్దగా ఇండస్ట్రీని గాడిలో పెట్టాల్సిందిపోయి... హీరోలపై కామెంట్స్ చేస్తున్నాడు. హీరోలు, హీరోయిన్లు, కమెడియన్స్ ఇలా ఎవ్వరినీ వదలకుండా అందరినీ చెడామడా వాయించేస్తాడు దాసరి. కానీ ఈ విమర్శలే రామ్ చరణ్ కి, దాసరి నారాయణరావుకి మధ్య వైశమ్యాలను పెంచాయి. 'దాసరి కామెంట్స్ ఎందుకు చేశారో తెలియదు, హీరోయిన్లందరూ అవార్డ్ ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు.'అని చరణ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంతే ఈ ప్రకటనతో దాసరి, రామ్ చరణ్ ల మధ్య వివాదానికి కారణమైంది. ఇదే విషయంలో రామ్ చరణ్, బాలయ్య మధ్యకూడా కొన్ని రోజులు వివాదం నడిచింది. దీంతో నందమూరి, మోగా ఫ్యాన్స్ ల మధ్య గొడవలు ముదిరాయి. అదే కాక రామ్ చరణ్ ఓ అవార్డ్ ఫంక్షన్లో తమిళ డైరెక్టర్స్ ని, పోగడడం, వారితో సినిమా చెయ్యాలనుందని స్టేట్ మెంట్ ఇచ్చాడు. రామ్ చరణ్ కోరికపై బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. తమిళ డైరెక్టర్ల కంటే మనవాళ్లు దేనిలో తక్కువ.. ఇక్కడ గొప్ప గొప్ప సినిమాలు చేసిన వాళ్లు చాలామంది ఉన్నారు. చరిత్ర తెలుసుకో లేకపోతే బావుండదు అని ప్రేక్షకుల సాక్షిగా హెచ్చరించాడు. ఈ హెచ్చరికలు చెర్రీని ఉద్దేశించే అన్నాడని, నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని టాలీవుడ్ లో భారీ ప్రచారమే జరిగింది.
బాలీవుడ్ లోనూ ఇదే తంటా..
హిట్ ఫిల్మ్ దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే లోని ...'తుజేదేఖాయా తోయే జానా సనమ్'.. సాంగ్ ని పేరడీ మరో హీరో రణ్ బీర్ కపూర్ కాస్త ఇబ్బందికర సమయంలో పాడాడు. ఇలా రణ్ బీర్ పాడుతున్నపాటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుందట. షారుఖ్ ఖాన్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ అయిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలోని పాటను అసభ్యకరమైక ప్లేస్ లో పాడడం 'బాద్ షా' అభిమానులు గొడవచేస్తున్నారట. అంతే కాదు 'బేషరమ్' సినిమాలో ఆసీన్స్ తొలగించకపోతే రిలీజ్ ని కూడా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారట.
ఇలానే 'సల్మాన్' కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా దబాంగ్. ఈ సినిమాలోని చుల్ బుల్ పాండే గా సల్మాన్ పంచిన వినోదం బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. ఈ చుల్ బుల్ పాండేపై సెటైర్లు వేసి సల్మాన్ ఖాన్ అభిమానులకి ఆగ్రహం తెప్పించాడు 'రణ్ బీర్ కపూర్'. ఫ్లాప్ సినిమాపైనే కామెంట్స్ చేస్తే ఫ్యాన్స్ నానాభీభత్సం సృష్టించారట.
హీరోల కామెంట్స్ ని అభిమానులు సీరియస్ గా తీసుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సొంతవారికి దు:ఖాన్ని మిగులుస్తున్నారు. కానీ గొడవలకు దిగేముందు ఒక్కసారి ఆలోచించండి, సినిమా వాళ్లు ఏం చేసినా స్వలాభం కోసమేనని, గుర్తుంచుకుంటే, మీ భవిష్యత్తు చీకటిమయమవకుండా ఉంటుంది.

No comments:
Post a Comment