Saturday, August 31, 2013

'రామయ్యా' వచ్చాడు..

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు మరో తీయ్యటి కబురు వచ్చింది. ఎన్టీఆర్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' రెండో 'టీజర్' విడుదలయ్యింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ సమంతతో కలిసి
అదిరిపోయే స్టెప్పులు వేశాడు. టీజర్ విడుదలయిన కొద్ది సేపటికే అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. మొదటి టీజర్ లో డైలాగ్ లతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ దీనిలో క్లాస్ సాంగ్ తో అలరిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం 'న్యూ లుక్' (టీజర్) ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది.

No comments:

Post a Comment