Sunday, September 22, 2013

లంచ్ బాక్స్ టేస్ట్ అదిరింది.!

బాలీవుడ్ లో వైవిధ్యానికి మారుపేరుగా వచ్చిన సినిమా ' ది లంచ్ బాక్స్'. ఈసినిమా అంతా ముంబైలోని స్లామ్ నేపథ్యంగా సాగుతుంది. ఓ డబ్బావాలా చేసిన మిస్టేక్
తో ప్రారంభమవుతుంది సినిమా.. అయితే ఆ మిస్టేక్ వల్ల ఇద్దరు వ్యక్తులు మానసికంగా దగ్గరవుతారు. ఆ ఇద్దరి వ్యక్తీకరణలకు లంచ్ బాక్సే వేదిక. అలా ఒకరిని ఒకరు చూసుకోకుండానే ఇద్దరి మధ్య మెంటల్ రిలేషన్ డెవలప్ అవుతుంది. కానీ ఆమెకు పెళ్లవుతుంది.. అతను విడోయర్. మరి వీరి కథ ఏ తీరాలకు చేరిందనే విషయాన్ని అందమైన పోయెమ్ లా మలిచాడు దర్శకుడు 'రితేష్ బాత్రా' ..
  నిత్య జీవిత సమస్యలతో ఇబ్బంది పడే ఇల్లాలి ఆవేదన, భార్యపోయిన వ్యక్తి ఫీలింగ్స్ ను ఇర్ఫాన్, నిమ్రత్ అద్భుతంగా నటించారు. ఈ యేడాది కేన్స్ లోనూ ప్రదర్శించిన ఈ మూవీ ఈ నెల 20న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దీంతో సినిమాకు బాగా ప్రచారం వస్తోంది. సో.. ఈ లంచ్ బాక్స్ ప్రేక్షకులకు మంచి రుచిని చూపించిందని చెప్పవచ్చు.

No comments:

Post a Comment