బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్, సల్మాన్ మధ్య కోల్డ్ వార్ ఇప్పట్లో
ముగిసేలా లేదు. ఇటీవల ఓ ఇఫ్తార్ విందులో కలుసుకుని దగ్గరైనట్లు కనిపించిన
వీరు...
లోపల ఒరిజినల్ అలాగే ఉంచుకున్నారు. షారుక్ రీసెంట్ బ్లాక్ బస్టర్
హిట్ 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్'... ఈ ఇద్దరు ఖాన్ ల మధ్య పోరుకు మరింత ఆజ్యం
పోసింది. 'రోహిత్ శెట్టి' దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా
సినిమా 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' రూ. 271 కోట్లు వసూలు చేసి బాలీవుడ్
బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలచింది. అయితే ఈ సినిమా సల్మాన్ భాయ్ 'ఏక్
థా టైగర్' రికార్డ్ లను ఎప్పుడో తుడిచిపెట్టింది. దీంతో సల్మాన్ తో పాటు
అభిమానులూ హర్ట్ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ విషమయే సల్మాన్ కు
మింగుడుపడటం లేదట. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో షారుక్ రికార్డులకు సమాధానం
చెప్పాలని సల్మాన్ వెయిట్ చేస్తున్నాడని సల్మాన్ అభిమానులు
అంటున్నారు. సక్సెస్ అందరినీ దగ్గర చేస్తుంది. కానీ బాలీవుడ్ లో
ఇద్దరు 'ఖాన్' మధ్య మాత్రం వైరాన్ని మరింత పెంచుతోంది. కొంతకాలంగా కామ్ గా
ఉన్న షారుక్ , సల్మాన్...మధ్య 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' పెద్ద
చిచ్చుపెట్టిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
No comments:
Post a Comment