Tuesday, August 27, 2013

'తుఫాన్' పాటలు విడుదల


       
'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ తేజ నటించిన చిత్రం 'తుఫాన్'. ఈ చిత్రానికి అపూర్వలిఖియా దర్శకత్వం వహించగా.. ఫ్ల్రైయింగ్ టార్టల్ ఫిల్మ్ సమర్పణలో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో చరణ్ కు సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. 'తుఫాన్' ఆడియో విడుదల మంగళవారం హైదరాబాద్ లోని ఆపోలో హాస్పిటల్ లో విడుదలైంది. దీనికి సంబంధించిన మొదటి సిడీని ముఖ్య అతిథిగా హాజరైన అపోలో హాస్పిటల్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. '' ఇది నాకు ఆనందకరమైన రోజు. ఎందుకంటే నేను తెలుగు మెగా స్టార్ కుటుంబంలో ఒక భాగమైనందుకు. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను.' అని అన్నారు.
    అభిమానులకు షాక్ ఇచ్చిన చరణ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన సినిమా 'తుఫాన్' ను మొదట శిల్పా కళా వేదికలో జరగాల్సి ఉండగా.. ఆకస్మాత్తుగా ఆపోలో ఆసుపత్రిలో జరపడంపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఒక రకంగా ఇది తన అభిమానులకు ఇలా ఝలక్ ఇవ్వడం భాదాకరమని సినీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. 'తనకు ఈ రోజు మర్చిపోలేనిదన్నారు. దీనికి కారణం ఒకటి ఆపోలో ప్రారంభించి 25సంవత్సరాలు అవుతోందని, రెండు తన మామ పుట్టిన రోజన.. అందుకే ఇక్కడ ఆడియో ఇక్కడ విడుదల చేస్తున్నామని.. ఇక్కడకు వచ్చిన నా అభిమానులకు చాలా థ్యాంక్స్.'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీహారి, చరణ్ భార్య ఉపాసన, తనికేళ్ల భరణి,తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment