సినీ ఇండస్ట్రీలో అచ్చమైన 'తెలుగు చీరకట్టు' మచ్చుకు కూడా కనిపించకుండా పొదుపు డ్రెస్ లోకి మారిపోతుంది.
'చీర'రెండు అక్షరాల పదమైన మహిళల్లో కొత్త అందాన్ని తెస్తుంది. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే అలంకరణ. టాలీవుడ్
లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో చాలా మంది హీరోయిన్లు చీర కట్టులో ప్రేక్షకులను అలరించేవారు. 'చెంగావి చీర కట్టుకున్న చిన్నదీ'..
అని అక్కినేని వేసే స్టెప్ కు ఇప్పటికీ
అదిరిపోతుంది. 'మా ఇద్దరి కథ' సినిమాలో 'చిలకపచ్చ చీరకట్టి' అనే పాటకు
నృత్యం చేసిన మంజులను చూసినవారెవ్వరూ నేటికీ మర్చిపోరు. ఆ తర్వాతి తరం
విషయానికి వస్తే విజయశాంతి, సౌందర్య, భానుప్రియ, రాశి, ఇలా చాలా మంది
హీరోయిన్లు చీరకట్టులో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. ఇలా
వారు చీర కట్టులో నటించిన అనేక చిత్రాలు బంఫర్ హిట్ కొట్టాయి. కానీ నేడు
కనీసం హీరోయిన్ తల్లి కూడా చీరకట్టులో కనిపించని పరిస్థితి నెలకొంది.'చీర'రెండు అక్షరాల పదమైన మహిళల్లో కొత్త అందాన్ని తెస్తుంది. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే అలంకరణ. టాలీవుడ్
లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో చాలా మంది హీరోయిన్లు చీర కట్టులో ప్రేక్షకులను అలరించేవారు. 'చెంగావి చీర కట్టుకున్న చిన్నదీ'..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చీర కనబడితే అదో పెద్ద వింతగా అనిపిస్తోంది. హీరోయిన్లకు బట్టలు ఎంత తక్కువగా ఉంటే ఆ సినిమాను ఎక్కువ మంది చూస్తారనే ట్రెండ్ లోకి వెళ్తున్నారు మన దర్శకులు. దీంతో ఇండస్ట్రీనే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హీరోయిన్స్ పొదుపు డ్రెస్స్ లు వేసుకొని తెగ ఎక్స్ పోజింగ్ చేస్తుంటే ఓ కుటుంబం ఎలా సినిమా చూస్తుందో అర్థం కాని విషయం. అందుకే కుటుంబ సభ్యులు కలిసి సినిమా చూడడానికి రావడం లేదు. మన సినిమాలు వారం రోజులు కూడా థియేటర్లలో ఆడడం లేదనడానికి నిదర్శనం కొకటి విషయం మన దర్శక నిర్మాతలు మర్చిపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి చూస్తే సమంత, శ్రుతి హాసన్, కాజల్, అనుష్క, అంజలి, ఇలా చాలా మంది హీరోయిన్స్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. వీరు అడపాదడపా చీరకట్టు కడుతోన్నా అది పూర్తి స్థాయిలో ఉండడం లేదు. హీరోయిన్స్, వారి సినిమాలు, చీర కట్టు విషయంలో ఏ దర్శకుడు ఎలా ఉంటారు అనేది మన ట్రెండ్ గురులో చూద్దాం...
చీరకట్టులోని హీరోయిన్స్..
'సమంత'... 'ఏ మాయ చేసావె' ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా. సాధారణంగా కొత్త హీరోయిన్ అనగానే పొట్టి డ్రస్సుల్లో పండగ చేయడం టాలీవుడ్ ట్రెండ్. కానీ సమంతా ఆ ట్రెండ్ ని బ్రేక్ చేసింది. అప్పటి దాకా హీరోయిన్ లని మోడ్రన్ డ్రస్సుల్లో చూసి బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకులు సమంత చీర కట్టుకు ఫ్లాట్ అయి పోయారు. 'గబ్బర్ సింగ్' ఈ మధ్య కాలంలో మెగా కలెక్షన్ లు సాధించిన పవర్ స్టార్ సినిమా. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సక్సెస్ కి పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ యాక్షన్ ఒకటైతే.. శ్రుతి హాసన్ చీరకట్టు మరో ఆకర్షణ. అచ్చ తెలుగు ఆడపడుచులా చీరకట్టులో శ్రుతి కనిపించడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. హీరోయిన్ అంటే మోడ్రన్ డ్రెస్సుల్లో మెరవాలి అన్న మాటకి చెక్ పెట్టినహీరోయిన్ సౌందర్య. ఆమె చీర కట్టులో నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షాన్ని కురిపించాయి-చీర కట్టులో బోలెడంత అందం ఉందని నిరూపించాయి. హీరోయిన్ మోడ్రన్ డ్రెస్ లో ఉంటేనే సినిమాకు కమర్షియల్ హిట్ వస్తుందన్న మాట తప్పని ఆమె సినిమాలు నిరూపించింది.
ఇక అచ్చు తెలుగు అమ్మాయిలా కనిపించే మరో హీరోయిన్ 'అంజలి'. ఆమె నటించిన సినిమాల్లో ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తూ తెలుగుదనం ఇంకా మిగిలే ఉందని గుర్తు చేస్తోంది. ఇక మిగతా ఏ హీరోయిన్ ను టచ్ చేసినా ఒంటి మీద చాలా పొదుపు డ్రెస్ లతోనే దర్శనమిస్తారు.
చీరకట్టుకు ప్రాధాన్యతనిస్తున్న దర్శకులు..
ఇక దర్శకుల విషయానికి వస్తే.. తెలుగు సినిమాలో అందమైన అమ్మాయి అంటే ఎలా ఉంటుంది... తెలుగమ్మాయి అన్న మాటకు రూపం వస్తే ఎలా ఉంటుంది... అచ్చు 'బాపు' బొమ్మలా ఉంటుందని చాలా మంది సినీ ప్రేక్షకులు చెబుతారు. అలాగే తెలుగు తనానికి పెద్ద పీట వేసిన మరో దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయన సినిమాలన్నీ సంగీత సాహిత్యాలకు-సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటాయి.
నేటి దర్శకులలో సంప్రదాయాలకు 'హ్యాపీ డేస్' తెచ్చిన డైరెక్టర్ 'శేఖర్ కమ్ముల'. ఆయన ప్రతి సినిమా లో కథానాయిక అచ్చమైన చీరకట్టులో తెలుగమ్మాయిలా కనిపిస్తుంటుంది. బెంగాలీ భామలను తెలుగు బొమ్మలుగా చూపిన ఘనత ఆయనకే దక్కుతుంది.
మోడ్రన్ ట్రెండ్ ఫాలో అయ్యే క్రియేటివ్ దర్శకుడు 'కృష్ణ వంశీ'. ఆయన రొమాంటిక్ సాంగ్స్ తీసేటప్పుడు హీరోయిన్ లను చీరలోనే చూపిస్తాడు. చీర మిగిలిన డ్రెస్ ల కంటే ప్రత్యేకమని చెప్పకనే చెప్తాడు. కృష్ణ వంశీ రొమాంటిక్ సాంగ్స్ స్పెషలిస్ట్ గా పేరు పొందారంటే- ఆ పేరులో సగ భాగం చీరకే ఇచ్చేయాలి. ఇలా కొందరు దర్శకులు తగ్గిపోతున్న చీరకట్టును ఫాలో అవుతున్నారంటే చీరకు ఉన్న ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పకైనా మన దర్శకులు , హీరోయిన్లు అచ్చమైన తెలుగు చీరకట్టును ఫాలో అవాలని కోరుకుంద్దాం..

No comments:
Post a Comment