Monday, August 26, 2013

'అమీర్ పేట'లో యూత్ ఏం చేస్తారు..?

శ్రీ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం '' అమీర్ పేట్ లో''. 'పద్మశ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ నిర్మిస్తున్నారు. 'శ్రీ'కి జంటగా
 'మోనిక' నటిస్తోంది. ఈ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీ మాట్లాడుతూ..' అమీర్ పేటలో విద్యార్థులు, జాబ్ ల కోసం కుస్తీలు పడే వారు వేలల్లో ఉంటారు. దీన్ని నిరుద్యోగులు సరదాగా మరో 'యుఎస్ఎ'గా పిలుచుకుంటారు. ఇక్కడ కోచింగ్ ఇస్టిట్యూట్స్, ఉద్యోగావకాశాల కరపత్రాలు, నరకం చూపించే ట్రాఫిక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలకు అమీర్ పేట ఫేమస్. ఎంతో మంది యువకుల జీవితాలతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఇలాంటి ఆసక్తికర కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాము'. అని అన్నారు. ఈ చిత్రంలో మురళి లియోన్ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment