Monday, August 26, 2013

ఆ హీరో 'ఖాన్'లను వణికిస్తున్నాడు!

హాలీవుడ్ హీరోకు కావల్సిన అన్ని లక్షణాలున్న ఇండియన్ హీరో 'హృతిక్ రోషన్'. స్పానిష్ హీరోలా సిక్స్ ప్యాక్ తో కనిపిస్తూ.. 
గ్రీకు వీరుడిలాంటి కటౌట్ తో హీలీవుడ్ హీరోలకుఏ మాత్రం తీసిపోను అనేలా కనిపిస్తాడు. 'క్రిష్' తో ఇండియన్ అభిమానుల మనసుదోచుకున్న ఈ హీరో దానికి కొనసాగింపుగా ఇప్పుడు 'క్రిష్-3' తో వస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన 'ట్రైలర్' చూసిన బాలీవుడ్ 'ఖాన్ త్రయా'నికి కంటి మీద కునుకు లేదని సమాచారం. హాలీవుడ్ ను కూడా ఆశ్చర్యపరిచిన ఈ ట్రైలర్.. ఫ్యూచర్ లో భారతీయ సినిమాలు హాలీవుడ్ ను తలదన్నే స్థాయిలో ఉంటాయనే భావన కల్గుతోందట. ఇప్పటికే సినిమా మేకింగ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇక దానికి అనుగుణంగా టెక్నాలజీని అంది పుచ్చుకుని వస్తున్న క్రిష్-3 ట్రైలర్ చూసిన వారెవరూ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తక్కువగా లేదనే చెబుతారు. ఇక హృతిక్ తండ్రి 'రాకేష్ రోషన్'డైరెక్ట్ చేసిన ఈ మూవీ కేవలం పదిరోజుల్లోనే కోటి పైగా యూట్యూబ్ హిట్స్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్ తోనే ఇలా ఉంటే ఈ దీపావళికి విడుదలవుతున్న ఈ మూవీతో 'ఖాన్'ల హవాకు హృతిక్ చెక్ పెడుతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.. 

No comments:

Post a Comment