'రోహిత్ షెట్టి'... ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ 'బాక్సాఫీస్ బొనాంజా'గా మారింది. 'జమీన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు...
'గోల్ మాల్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. మాస్ మసాలా కథలకు కామెడీ జోడిస్తూ... సినిమాలు చేయడం రోహిత్ స్టైల్. ఈ ఫార్మాలాతోనే 'ఆల్ ద బెస్ట్', 'గోల్ మాల్' సిరీస్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా రూపొందించాడు. ప్రేక్షకుల అప్రిషియేషన్ తో పాటు భారీ హిట్స్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'బోల్ బచ్చన్', 'సింగమ్', 'గోల్ మాల్- 3' సినిమాలు సూపర్ సక్సెస్ తో రూ.వందకోట్ల కలెక్షన్స్ సాధించాయి. రీసెంట్ గా షారూఖ్ తో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' ఇప్పటికే రూ.280 కోట్ల వసూళ్లు సాధించి.. ఆల్ టైం రికార్డ్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. యూత్ ను ఆకట్టుకునే కథాకథనాలతో, అటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా సినిమాలను రూపొందిస్తుండటమే రోహిత్ షెట్టి సక్సెస్ కు, రికార్డ్ హిట్ సినిమాలకు కారణమని సినీ ట్రేడ్ పండితులు అంటున్నారు.
No comments:
Post a Comment