అందంతో పాటు నటనతో టాలీవుడ్ ను ఉర్రుతలూగించిన భామలు 'కాజల్', 'తమన్నా'. టాలీవుడ్ టాప్ హీరోయిన్లుగా ఉన్న ఈ ఇద్దరు నాయికలు ఫర్మార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేస్తూ...
ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీరికి తెలుగులో ఆఫర్లేవీ లేకున్నా ... బాలీవుడ్ లో మాత్రం మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. రీసెంట్ గా 'హిమ్మత్ వాలా'తో బాలీవుడ్ ను ఆకర్షించిన 'తమన్నా'.. అక్షయ్ కుమార్ తో 'ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు 'హమ్ షకల్స్' అనే చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టింది. ఇక తమిళ ఆఫర్లతో దూసుకుపోతున్న నటి కాజల్ రీసెంట్ గా 'బాద్ షా'లో ఎన్టీఆర్ తో స్టెప్పులేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ రామ్ చరణ్ తో'ఎవడు'లో అతిథి పాత్రలో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలేవి లేకపోయినా ఈ అమ్మడు కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. 'కార్తీ హీరోగా 'ఆల్ ఇన్ ఆల్ అఘజు రాజా', విజయ్ హీరోగా వస్తున్న 'జిల్లా' సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే 'మహేష్ బాబు', 'శ్రీనువైట్ల' కాంబినేషన్ వస్తున్న 'ఆగడు' సినిమాకి మొదట 'తమన్నా' ను హీరోయిన్ అనుకున్నా.. ఆ ఆఫర్ ను శృతిహాసన్ ఎగరేసుకెళ్లింది. దీంతో ఈ ఇద్దరూ బ్యూటీలు ఇతర 'వుడ్'లోకి వలసెళ్లారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment