Thursday, August 29, 2013

హీరోగా 'డిఎస్పీ..'!

'దేవీ శ్రీప్రసాద్'.. టాలీవుడ్ ను ఏలుతున్న సంగీత దర్శకుడు. స్టార్ హీరోల నుంచి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్న హీరోల వరకు అందరూ శ్రీ మ్యూజిక్ కావాలని కోరుకుంటారు. అదీ మ్యూజిక్ డైరక్టర్ గా దేవీ స్పెషాలిటీ. ఈ కంపోజర్ పద్నాలుగేళ్ల కెరీర్ లో
మ్యూజికల్ గా ఫ్లాపైన సినిమాలు లేవు. స్టార్ హీరోలందరి సినిమాలకు సంగీతాన్నిస్తున్న దేవీ..ప్రసుత్తం 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. చాలా సినిమాల ఆడియో వేడుకల్లో ఆడిపాడుతూ...అందరినీ ఆకట్టుకోవడం దేవీకి అలవాటు. దేవీ లోని ఈ ఎనర్జీ చూసిన చాలా మంది అతన్ని హీరో చేయాలన్నారట. సరిగ్గా ఇదే ఆలోచన డైరెక్టర్ సుకుమార్ కు వచ్చిందట. దీనికి తోడు దేవీ, సుకుమార్ ల మధ్య అంతకు ముందునుంచే మంచి రిలేషన్ ఉంది. దాంతో సుకుమార్ ప్రసాద్ ని హీరో చేయాలని ఫిక్స్ అయినట్లు టాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ ఆలోచనకు ఇతర భాషల నిర్మాతలు రెఢీ గా ఉన్నట్లు టాలీవుడ్ టాక్. ఇదే విషయాన్ని దేవీని అడగ్గా ఇప్పుడొద్దులే అంటూ దాటవేశాడట. అయితే ఇప్పటికే ఆయన తెరపైకి ఎంట్రీ ఓకే అయ్యిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దేవీ శ్రీప్రసాద్ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. సో ఇంత ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి..

No comments:

Post a Comment