Monday, August 19, 2013

హీరోలు సర్జరీ స్టార్సా? టాప్ స్టార్సా?


టాలీవుడ్ లో హీరోలు ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనబడుతుంటారు. ఎందుకు ? మొదటి చిత్రంలో ఉన్న హీరోకు తాజా చిత్రంలో ఉన్న హీరోకు అసలు పోలిక ఉండదు..ఒక్కసారిగా ఎలా మారిపోతాడు. అనే సందేహం అందరిలో మెదులుతూ ఉంటుంది. కాని దీనికి సమాధానం ఉండదు. 'జూనియర్ ఎన్టీఆర్' గత చిత్రాలలో ఎంతో లావుగా కనిపించేవారు. తరువాత స్లిమ్ అయిపోయాడు. 'గంగోత్రి'లో ఉన్న 'బన్నీ' కి ఇప్పుడున్న 'బన్నీ'కి ఏమన్నా పోలిక ఉందా ? మనం లావుగా ఉంటే తక్కువ కావడానికి ఎన్నో ఎక్సర్ సైజులు చేసి తగ్గించుకుంటాం. దీనికి ఎంతో సమయం పడుతుంది. కాని ఈ హోరోలకు ఏ మాత్రం సమయం పట్టదు. కొద్ది నెలల్లోనే స్లిమ్ గా..అందంగా తయారవుతారు.. దీనికంతటికి 'సర్జరీ' యేనని టాలీవుడ్ టాక్..
సుశాంత్ : తాజా చిత్రం 'అడ్డా' చూశారా. ఎంత స్లిమ్ ..అందంగా తయారయ్యాడో చూశారా ? కాని 'కాళిదాసు', 'కరెంటు' సినిమాలలో 'సుశాంత్' ఎలా ఉన్నాడో చూశారా. 'కరెంటు' సినిమాలో విద్యార్థిగా కనిపించాడు. కాని ఈ క్యారెక్టర్ కు సుశాంత్ అంతగా సూట్ కాలేదని విమర్శలు వచ్చాయి. వెంటనే ఫిజిక్ ను ఛేంజ్ చేసేపనిలో పడ్డాడు. లవర్ బాయ్ ఎలా ఉండాలో అలా తయారయ్యాడు. ఇదంతా 'సర్జరీ' వల్లే అయ్యిందని ' క్రిటిక్స్ పేర్కొంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ : డ్యాన్స్, ఫైట్స్ లలో అదరహో అనిపించుకుంటున్న నటుడు 'జూనియర్ ఎన్టీఆర్'. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తూ మోస్ట్ హ్యాండ్ సమ్ టాలీవుడ్ హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దానికోసం ఇప్పటి నుండే వర్కవుట్స్ కూడా చేస్తున్నాడంట. కాని ఇలాంటి మార్పులు రావడానికి ఎన్నో మార్పులు చేసుకున్నాడని విమర్శలు ఉన్నాయి. 'నరసింహుడు, 'రాఖీ' సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ఆ తరువాత 'కంత్రీ' సినిమాలో స్లిమ్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఇంత తక్కువ టైంలో ఇలా ఎలా తయారయ్యాడని అందరూ ఆశ్చర్యపోయారు. తక్కువ టైంలో లావు తగ్గడం కోసం లైపో చేయించుకున్నాడని టాక్ ఉంది.అంతేకాకుండా ముక్కును కూడా సర్జరీ చేయించుకున్నాడనే న్యూస్ కూడా ఉంది.
రామ్ చరణ్ : 'చిరుత' లో మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్' అదరహో అనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్ లతో మెగాస్టార్ అభిమానులను అలరించాడు. కాని 'రామ్ చరణ్' లుక్ చూసిన జనాలు నిరాశ చెందారు. 'చిరుత'-'ఆరెంజ్' సినిమాలలో నటించిన 'రామ్ చరణ్' కు ఎంతో తేడా ఉందని విమర్శలున్నాయి. 'మగధీర' లుక్ ఒరిజినల్ కాదని, సర్జరీలు చేయించుకున్నాడని క్రిటిసిజం పోస్టుల మీద పోస్టులు చేసింది. రామ్ చరణ్ ఏడు సార్లు సర్జరీ చేయించుకున్నాడని విమర్శలున్నాయి.
అల్లు అర్జున్ : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరో 'అల్లు అర్జున్' ఈయన మొదటి చిత్రం 'గంగోత్రి' . మొదటి సినిమాలో అల్లు అర్జున్ కు ఇప్పటి సినిమాల్లోని అల్లు అర్జున్ కు చాలా తేడా ఉంది. స్టైలిష్ లుక్స్ తో కనిపించి 'స్టైలిష్ స్టార్ ' అయ్యాడు. ఈ స్టైలిష్ లుక్స్ అంతా సర్జరీతోనే సాధ్యమైందని, లేకపోతే 'బన్నీ' మినిమం గ్యారంటీ హీరో కూడా అయ్యే వాడు కాదని న్యూస్ వినిపించాయి.
చిరంజీవి : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన వారు సర్జరీలు చేయించుకుంటే మెగస్టార్ 'చిరంజీవి' కూడా సర్జరీలు చేయించుకున్నాడని వార్తలు ఉన్నాయి. 'జై చిరంజీవ' 'స్టాలిన్' సినిమాలో లావుగా కనిపించిన'చిరంజీవి' తరువాత స్లిమ్ గా మారిపోయాడు. లైపో చేయించుకుని లావు తగ్గాడని, అంత త్వరగా స్లిమ్ అవ్వడం కష్టమని క్రిటిక్స్ పేర్కొంటున్నారు.
బాలకృష్ణ : నందమూరి ఎన్టీరామరావు తనయుడు 'బాలకృష్ణ' కూడా లావు తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకున్నాడని టాలీవుడ్ టాక్. లావు ఎక్కువగా ఉండడం వల్ల సరియైన మూవ్ మెంట్స్ చేయలేక పోతున్నాడని, బాడీ లాంగ్వేజ్ లో ఛేంజ్ లు కనిపిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. 
మంచు విష్ణు : విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు 'మంచు విష్ణు' సూర్యం, అస్త్రం, ఢీ సినిమాల్లో నటించాడు. కొంచెం లావుగా కనిపించాడన్న విమర్శలు రావడంతో స్లిమ్ గా తయారు కావడానికి ప్రయత్నించాడు. ఆ తరువాత 'సలీం', 'వస్తాడు రారాజు' లాంటి సినిమాల్లో 'మంచు విష్ణు' ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో స్లిమ్ గా మారిపోయాడు. దీనికి సీక్రెట్ సర్జరీయేనని టాక్ వచ్చింది. లావు తగ్గినప్పటి నుండి డ్యాన్స్ లో మెప్పిస్తున్నాడు.

No comments:

Post a Comment