హైదరాబాద్: ఇప్పుడిప్పుడే వెలుగుతున్న నటి సాయి శిరీష కిడ్నాప్ మిస్టరీ వీడింది. తాను ఎందుకు అదృశ్యమయ్యానో తదితర వివరాలను '10టివి'కి చెప్పింది. 'లవ్ అటాక్'
అనే ఒక్క సినిమాలోనే నటించిన 'సాయి శిరీష' ఈ నెల 15న షూటింగ్‌కని వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అనే ఒక్క సినిమాలోనే నటించిన 'సాయి శిరీష' ఈ నెల 15న షూటింగ్‌కని వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కూతురు కోసం తల్లడిల్లిపోతున్నామన్న తల్లిదండ్రులు రెండు రోజులకే..శిరీషపై ఫైరయ్యారు.ఆమెకు పెళ్లి చేయాలనుకున్నామని.. ఆమెకు ఇష్టం లేదని.. వేరే వారితో ఎఫెయిర్స్ ఉన్నాయని అందుకే వెళ్లిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలువిన్నవారుఖంగుతిన్నారు. ఆమె చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా ఆశ్చర్యం, ఆవేశం రెండూ ఒకసారే కలగటం ఖాయం.
తన వారు చేస్తున్న ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని భావించి తాను అజ్ఞాతం నుండి బయటకు వచ్చినట్లు శిరీష తెలిపింది. భయంకరమైన నిజాలు చెప్పింది. చెప్పలేని ఘోరాలను అతి కష్టం మీద వివరించింది. తనపై ఫిర్యాదు చేసిన తండ్రి ..తండ్రి స్థానంలో ఉన్న మగాడని చెప్పింది. ఈ మగాడు మృగాడుగా మారాడని 'శిరీష' ఆరోపిస్తోంది. తండ్రి స్ధానంలో ఉండి రక్షణగా ఉండాల్సినవాడే భక్షించడానికి ప్రయత్నించాడని,తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని 'శిరీష' మండిపడుతోంది. అతడి వేటను తట్టుకోలేక పారిపోయాని చెప్పింది. వారు ఆరోపించినట్లు తనకు ఎవరితో ఎఫైర్ లేదని, ఇవన్నీ కట్టుకథలేనని పేర్కొంది. మంగళవారం పోలీసుల ఎదుట హాజరైతున్నట్లు శిరీష చెప్పింది.
కూతురు లాంటి ఆడపిల్లను కూడా కాటేయాలని కామపిశాచాలు బుసలు కొడుతున్నాయి. ఎటు పోతోందీ సమాజం? భూమి గుండ్రంగా ఉన్నట్లు.. మళ్లీ ఆటవిక సమాజం వైపు పయనిస్తున్నామనే అనుమానాలు వస్తున్నాయి. సాయి శిరీష ధైర్యంగా తనకొచ్చిన ఆపదను చెప్పింది. చెప్పలేక తమలో తామే కుమిలిపోతున్న బంగారు తల్లులెందరు ఉన్నారో? అందుకే మరెవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉండేలా.. తన తండ్రి కాని తండ్రిని శిక్షించాలని 'శిరీష' కోరుతుంది.

No comments:
Post a Comment