'బాద్ షా' అవమానికి గురయ్యాడని బాలీవుడ్ కోడై కూస్తోంది. రూ.500 పెట్టి టికెట్ కొనకుండా ఓ లేడీ ప్రొడ్యూసర్ చేతిలో ఘోరంగా అవమానం
చెందాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది..? 'షారుఖ్ ఖాన్..' బాలీవుడ్ బాద్ షా! అమితాబ్ తరువాత ఆ స్థానం షారుఖ్ దే అని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. అయితే.. అడల్ట్ సినిమాలు తీసే నిర్మాతగా పేరు తెచ్చుకున్న 'ఏక్తాకపూర్' కు 'షారుఖ్ ఖాన్'కు అస్సలు పడదంట! ఇదిలా ఉంటే.. 'అక్షయ్ కుమార్ - ఇమ్రాన్ ఖాన్ - సోనాక్షి సిన్హా' తారాగణంతో 'ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై అగైన్' అనే సినిమాను 'ఏక్తా కపూర్' తీసింది. ఈ చిత్రం విడుదలై హిట్ టాక్ తో నడుస్తోంది. దీనితో ఆ సినిమాను చూడాలనుకున్న 'షారుఖ్' తన పి.ఎ.ను పంపించి ఏక్తా వద్ద కొన్ని టికెట్స్ తెమ్మని చెప్పాడంట. దీంతో కొండపైకెక్కిన ఏక్తా.. '' సినిమా చూడాలనుకుంటే థియేటర్ వద్దకు వెళ్లి చూడాలి. టికెట్స్ అడిగితే మాత్రం ఇవ్వను '' అని 'ఏక్తా' కుండబద్ధలు కొట్టినట్లు చెప్పిందంట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. పాకి బాలీవుడ్ మొత్తం గుప్పుమంది. ఓ ఐదు వందలు పెట్టి సినిమా చూస్తే సరిపోయేది కదా..! దీనికి ఏక్తా వద్దకు వెళ్లి టికెట్స్ అడగి అవమానించుకోవడం ఎందుకని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. ఓ స్టార్ హీరో దిగొచ్చి టికెట్స్ అడిగితే ఇలా అవమానించడం సరైన పని కాదని ఏక్తాకపూర్ తీరుపై పెదవి విరుస్తున్నారు బాలీవుడ్ జనం.
No comments:
Post a Comment