Sunday, August 11, 2013

మైక్రో వేవ్- లోఫ్యాట్ తందూరి చికెన్

కావలసిన పదార్థాలు: 
కొవ్వు తక్కువగా ఉండే చికెన్: 1kg 
వెల్లుల్లి రేకలు: 6 
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2tbsp 
పుల్లటి పెరుగు: 150grm 

నూనె: 125 grm 
కారం: 2tbs 
జీలకర్ర, దనియాల పేస్ట్: 2tbsp 
గరం మసాలా: 1tsp 
పసుపు: చిటికెడు
 ఉప్పు: సరిపడా 
మిఠాయిరంగు: తగినంత 
నిమ్మరసం: 2tbsp

యారు చేయు విధానం: 
1. ఒక కోడి మొత్తం తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోవాలి. పైన చర్మం అంతా తీసివేసి చాకుతో బాగా గాట్లు పెట్టి పెద్ద ముక్కలుగా కోయాలి. 2. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, దనియాపేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఒక గిన్నెలో తీసుకొని దానికి ఉప్పు, పసుపు, మిఠాయి రంగు కలిపి కోడి ముక్కలకు పట్టించాలి. నిమ్మరసాన్నికూడా వాటికి పట్టించి, పుల్లటి పెరుగును, గరం మసాలా కూడా కలిపి 7-8 గంటలపాటు నానబెట్టాలి. లేదా ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 3. మసాలా, పెరుగు మిశ్రమాలు ముక్కలకు బాగా పట్టిన తరువాత వాటిని తీసి కొద్దిగా ఆయిల్ వేసి పక్కనుంచాలి. 4. ఇప్పుడు మైక్రో వోవెన్ లో 350డిగ్రీతో ఉంచి మైక్రోవోవెన్ డిష్ లో చికెన్ ముక్కలను పెట్టి 20 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. 5. ఇప్పుడు మైక్రోవొవెన్ స్విచ్ ఆఫ్ చేసి మరి కొద్దిగా అయిత్ వేసి మళ్ళీ 10నిమిషాల పాటు తక్కువ టెంపరేచర్ లో హీట్ చేయాలి అంతే ఎర్రగా ఘుమఘుమలాడే తందూరీ చికెన్ తయార్. ఈ తందూరి చికెన్‌ ను అలాగే అయినా, ఏదేని సాస్‌ తో లేదా రోటీలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.

No comments:

Post a Comment