హైదరాబాద్ : సమైక్య సెంటిమెంట్ ను రాష్ట్రంలోని వివిధ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమైక్య వాణితో ప్రజలకు దగ్గరకావడానికి తహతహలాడుతున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీల నేతలు
పడరాని పాట్లు పడుతున్నారు. తామే నిజమైన సమైక్యవాదులమని చాటుకుని ఓట్లు కొల్లగొట్టేందుకు పక్కా స్కెచ్ తో వారు ముందుకెళుతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే విభజన ప్రకటన చేసి తెలంగాణలో కాంగ్రెస్ గ్రౌండ్ ను సిద్ధం చేసుకోగా.. సీమాంధ్రలో పాగా కోసం అధికార పార్టీతో పాటు, ఇతర పార్టీల మధ్య పోటీ నెలకొంది.
రంగంలోకి సిఎం
తెలంగాణ ప్రకటనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీంతో ఆ ప్రాంతంలోనూ కాంగ్రెస్ కు సానుకూల వాతావరణం ఏర్పరచేందుకు ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగారు. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయాన్నే ధిక్కరించి.. సీమాంధ్రుల పక్షపాతిగా మారారు. అంతేకాదు సమైక్యాంధ్ర కోసం అవసరమైతే సిఎం పదవినే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
టిడిపి లేఖాస్త్రం
టిడిపి లేఖ రాసినందుకే కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణను ప్రకటించిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్రుల మనసు దోచుకునేందుకు బాబు తాజాగా లేఖాస్త్రాన్ని ప్రయోగించారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అంతర్గత సమస్యగా వాడుకోకుండా..సీమాంధ్రుల అభ్యంతరాలు తేల్చాలంటూ ప్రధానికి లేఖ రాశారు. ఈవిధంగా సీమాంధ్రులకు దగ్గరయ్యేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు.
వైకాపా రాజీనామాలు
సీమాంధ్రులకు దగ్గరయ్యేందుకు వైకాపా రాజీనామాలను అస్త్రంగా చేసుకొంది. తామే నిజమైన సమైక్యవాదులమంటూ జగన్, విజయలక్ష్మి తమ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో సమైక్య పోరులో తామే ఫస్ట్ అని వారు చాటుకుంటున్నారు.
ఇలా.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సీమాంధ్రలో పాగా వేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

No comments:
Post a Comment