Wednesday, August 7, 2013

'స్పాట్ ఫిక్సింగ్..క్రిమినల్ నేరంగా పరిగణించాలి'

ముంబై: స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడే వారి గుండెల్లో భయం సృష్టించేలా ఆ నేరాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ సూచించారు. ఇటీవల కాలంలో చోటు
చేసుకుంటున్న పరిణామాల పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బిసిసిఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపిఎల్ టోర్నమెంట్ లో అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం పట్ల ద్రావిడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశాడు. మరో వైపు అతడు సారథ్యం వహిస్తున్న రాజస్తాన్ రాయల్స్ జట్టులో ముగ్గురు క్రీడాకారులు స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్టు చేయడం, ఆ పై బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఐపిఎల్ మాత్రమే కాదు.. భారత క్రికెట్ ప్రతిష్ట సైతం అంతర్జాతీయంగా మసకబారింది. గతంతో పోల్చుకుంటే క్రికెట్ ప్లేయర్ల ఆదాయం అసాధారణ స్థాయిలో పెరిగినా స్పాట్ ఫిక్సింగ్ , మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి అవాంఛనీయ పరిణామాలు రానురాను పెరిగిపోవడాన్ని ద్రావిడ్ ఏ మాత్రం భరించలేకపోతున్నాడు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే 'క్రిమినల్ నేరం'గా పరిగణించడం మినహా వేరేదారి లేదని చెప్పాడు.స్పాట్ ఫిక్సింగ్ లో దోషులుగా తేలిన వారిని క్రిమినల్స్ గా పరిగణిస్తే ఫిక్సింగ్ చేయాలంటే భయపడుతారని ద్రావిడ్ అంటున్నారు.
వీడియో చూడగలరు: http://youtu.be/zqjR-fsR3ZI

No comments:

Post a Comment