Thursday, August 29, 2013

'టాలీవుడ్ విలన్'.. బోజ్ పురి హీరో.!

'ఇండియన్ వెండితెర'.. ఈపేరులో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. వివిధ భాషలు.. అనేక సినిమాలు..
ఒక్కొ ఇండస్ట్రీది ఒక్కో స్టైల్. అయితే మన దేశంలో బాలీవుడ్ తర్వాత బడ్జెట్ పరంగా ఎక్కువ దమ్మున్నది మన టాలీవుడ్ అని అంతా అంటుంటారు. అందుకే ఇక్కడ సినిమా చేస్తే తమ మార్కెట్ పెరుగుతుందని చాలామంది నటులు ఫీలవుతుంటారు. రీసెంట్ గా టాలీవుడ్ లో 'ఈగ' సినిమాతో కన్నడలో స్టార్ హీరో అయిన 'సుదీప్' విలన్ గా నటించి సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు 'భోజ్ పురి'లో స్టార్ హీరో అయిన 'రవికిషన్' కూడా తెలుగులో విలన్ గా నటించబోతున్నాడు. ఆయన ఇంతకు ముందు నటించిన రీమేక్ సినిమాల్లో చాలానే సూపర్ హిట్ కొట్టాయి. ఈ మధ్యే భోజ్ పురిలో అతను 'డాన్' సినిమాను రీమేక్ చేశాడు. ఈ సినిమాలో అతని స్టైలిష్ పర్ఫార్మెన్స్ కు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఫ్లాట్ అయ్యాడట. అందుకే ఇప్పడు తను చేస్తున్న రేసుగుర్రంలో మెయిన్ విలన్ గా రవికిషన్ తో చేయిస్తున్నాడు. సినిమాలో శివారెడ్డి అనే పాత్రలో రవి కనిపిస్తాడట. మరి ఈ సినిమా ఈగ లా హిట్ అవుతుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.

No comments:

Post a Comment