Friday, August 9, 2013

మహిళా కండక్టర్లు ఆత్మహత్యాయత్నం

గుంటూరు: డిపో మేనేజర్ ఇష్టానుసారంగా డ్యూటీలు వేస్తున్నారంటూ ఐదుగురు మహిళా కండక్టర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వినుగొండ ఆర్టీసీ డిపోలో శుక్రవారం చోటు చేసుకున్న
ఈ సంఘటన కలకలం సృష్టించింది. వినుగొండలో ఆర్టీసీ డిపోలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఐదుగురు మహిళా కండక్టర్లు విశ్రాంతి గదిలోకెళ్లి తాళం వేసుకుని ఆత్మహత్య చేసుకోవాడానికి ప్రయత్నించారు. డిపో మేనేజర్ ఇష్టానుసారంగా తమకు విధులను కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మహిళా కండక్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చార్జ్ షీట్ వేసి డ్యూటీలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆర్ఎమ్ వో రామారావు మాట్లాడుతూ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసిన మహిళా కండక్టర్లను రెగ్యులరైజ్ చేసి, సీనియారిటీ ప్రకారం విధులను కేటాయించామని తెలిపారు. కానీ వారు ఇంతకముందున్న డ్యూటీలను కోరుకుంటున్నారని తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

No comments:

Post a Comment