Thursday, August 8, 2013

'నేనొక్కడినే' రెండో టీజర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న '1' (నేనొక్కడినే) చిత్రానికి సంబంధించిన రెండో టీజర్ విడుదలైంది. 'మహేష్' బర్త్ డే సందర్భంగా
శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్ లో 'మహేష్' పోరాట దృశ్యాలున్నాయి. 'మహేష్' అభిమానులకు కానుకగా దీనిని రిలీజ్ చేసే ఏర్పాటు చేశారు. తొలి టీజర్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం రోజున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ దృశ్యాలు, ఛేజింగ్, రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో 'మహేష్' సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
38వ వసంతంలోకి అడుగు పెడుతున్న 'మహేష్'
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు నేడు పండుగ రోజు. ఈ రోజు మహేష్ 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. 1975 ఆగస్టు 9వ తేదీన ఘట్టమనేని కృష్ణ - ఇందిరాదేవిలకు 'మహేష్' జన్మించాడు. 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 'నీడ' అనే చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత ఎనిమిది చిత్రాలలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం తనదైన శైలిలో నటిస్తూ ముందుకు దూసుకెళ్లాడు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే నంది అవార్డులు 8 అందుకున్నాడు. వీటితో పాటు ఫిలిం ఫేర్ అవార్డులను కూడా కైవసం చేసుకున్నాడు. 'వంశీ' చిత్రంలో నటించిన 'నమ్రత శిరోడ్కర్'ను 2005లో వివాహం చేసుకున్నాడు. గౌతం, సితారా అనే ఇద్దరు పిల్లలున్నారు. 
మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు..

No comments:

Post a Comment