టాలీవుడ్ లో నిన్నటి దాకా పవన్‌కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' శాటిలైట్ హక్కుల ధరే ఎక్కువ అని చెప్పుకొనేవారు. కానీ నేడు ఆ ధరను మహేష్‌బాబు
దాటేశాడని సమాచారం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరి సినిమా ఇంత ధరకు అమ్ముడు కాలేదని టాలీవుడ్ టాక్. మరి ఆ రేట్ ఎంత అనే విషయం చెప్పకపోయినా హక్కులు మాత్రం భారీ రేటుకు అమ్ముడుపోయాయంటున్నారు మన సినీ జనాలు. దీంతో మహేష్ కొత్త రికార్డ్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఫలితంగా అతనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడని కూడా చెప్పవచ్చు.మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా '1'.(నేనొక్కడినే). ఈ మూవీకి సంబంధించిన శాటిలైట్ హక్కులను సన్ నెట్ వర్క్ సంస్థ తరఫున జెమినీ టీవీ కొనుగోలు చేసింది. తమిళం, మలయాళంలోడబ్బింగ్ హక్కులను కలుపుకొని ఓ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేశారని సమాచారం. అది పవన్ సినిమాను అధిగమించిందని చిత్రబృందం చెబుతోంది. అయితే ఈ హాట్ రేట్ ఎంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..
.jpg)
No comments:
Post a Comment