Friday, August 16, 2013

'కొచ్చాడియాన్' స్టోరీ లీక్..

సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఓ చిత్రంలో నటిస్తున్నారంటే దానికెంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. ఆయన చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? చిత్ర విశేషాలు ఏమిటీ ?

 అనే దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తూ ఉంటుంటారు.  'రజనీకాంత్' తాజాగా నటిస్తున్న 'కొచ్చాడియన్' స్టోరీ లీక్ అయ్యింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీ కూతురు 'సౌందర్య' దర్శకత్వం వహిస్తుండగా సునీల్ లల్లూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'రజనీ' వేషధారణ..కథ..ఇతర విషయాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కథ లీకేజీ కావడం వెనుక చిత్ర యూనిట్టే కారణమని ఫిలింనగర్ టాక్.. లీక్ అయిన స్టోరీ ఎంటో చూద్దామా..
'' ఓ రాజ్యానికి 'రాజు' ఉంటాడు. ఎలాగైనా రాజ్యాన్ని వశపరచుకోవాలని కొంతమంది విలన్లు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొందరు విలన్లు రాజుగారిని మోసం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన తన కొడుకుని రహస్య ప్రదేశంలో దాచిపెడుతాడు. తన రాజ్యాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని రాజు గారు భావిస్తాడు. దీనికి తన కుమారుడే కరెక్టు అని భావించి యుద్ధవిద్యలను నేర్పిస్తాడు. ఓ యోధుడిలా తీర్చిదిద్దుతాడు. తనను మోసం చేసిన వారిని ఓడించాలని కుమారుడికి చెప్పి యుద్ధానికి పంపుతాడు. ఆ యుద్ధంలో కుమారుడు గెలుస్తాడు. అందరూ అతడిని 'యువరాజు' అని పిలుస్తారు. ఇక్కడ 'రాజు' - 'యువరాజు' రెండు పాత్రలను 'రజనీ' పోషించారంట..ఇదండి కథ...

No comments:

Post a Comment