Friday, August 16, 2013

అనిశ్చితికి కారణం కాంగ్రెస్ - ఏచూరి

అనిశ్చితికి కారణం కాంగ్రెస్ - ఏచూరి

ఢిల్లీ: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న అనిశ్చితికి కాంగ్రెస్ పూర్తిగా భాద్యత వహించాలని సిపియం పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి అన్నారు.2009 లోనే తెలంగాణ
ఏర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ వెనక్కుతీసుకుందని గుర్తు చేశారు. నాలుగేళ్ల అనంతరం ఎటువంటి కసరత్తు చేయకుండా మరోసారి తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని అమలుపర్చేందుకు ఉన్న సమస్యలను అన్ని పార్టీలతో కలిసి చర్చించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.రానున్న ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై తమ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

No comments:

Post a Comment