
- - మోహనకృష్ణ ఇంద్రగంటి
ఫిజికల్ వయలెన్స్ చిత్రాలంటే అంతగా ఇష్టం ఉండదు. మానవీయ సంబంధాలు గల చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ తరహాలోనే నా చిత్రాలన్ని ఉంటాయన్నారు జాతీయ అవార్డ్ గ్రహీత ఇంద్రగంటి మోహన కృష్ణ. ఆయన చేసింది నాలుగు చిత్రాలే అయినా దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సున్నితమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే
మోహనకృష్ణ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'అంతకు ముందు ఆ తరువాత'. సుమంత్ ఆశ్విన్, ఈషా నటీనటులు. శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్ దామోదర ప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకిరానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి దర్శకుడు పాత్రికేయులతో ముచ్చటించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లో...
గోల్కొండ హైస్కూల్ షూటింగ్ సమయంలో దాముగారు నన్ను కలిసి ఓ సినిమా చేద్దాం అన్నారు. ఓకే అని నా దగ్గర ఉన్న కథ చెప్పాను. ఇంకొంచెం ఇంటెన్సిటీ ఉన్న కథ అయితే బెటర్ కదా అన్నారాయన. అప్పుడు 'అంతకు ముందు ఆ తరువాత కథ' చెప్పాను. అయితే ఈ కథ అప్పటికి ఐడియా దశలోనే ఉంది ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా రాయలేదు. దాము గారు చాలా ఎగ్టైటెడ్‌గా ఫుల్ వర్షన్ రాస్తే త్వరగా సినిమా చేద్దాం అన్నారు. ఆ విధంగా ఈ సినిమా ప్రారంభమైంది.
కథేంటి...
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఇష్టపడుతున్నాం అని చెపుకున్నాక వాళ్ళ మధ్య చనువు ఎక్కువ కావడంతో కొన్ని కొత్త విషయాలు, భయాలు బయటపడతాయి. ఆ వచ్చిన అనుమానాలు భయాలను ఈ జంట ఎలా డీల్ చేశారనేది. టైటిల్ వినగానే పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత అని చాలామంది అనుకుంటున్నారు. అలా ఉండదీ చిత్రం. ఎలా ఉంటుందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అనిల్, అనన్య పాత్రలు కీలకం. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమకథలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. మూడు ప్రేమ కథల అల్లిక ఈ చిత్రం. ఒక మాటలో ఉద్వేగభరితమైన ప్రేమకథాచిత్రం అని చెప్పొచ్చు.
సెమీ ఆటోబయోగ్రఫి...
ఏ సినిమాలోను లేని నా స్వానుభవాలు నా రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని అంశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. నావే కాదు నాకు తెలిసిన వాళ్లకి జరిగిన కొన్నిటిని కూడా కథకు అనుగుణంగా మార్చి ఈ చిత్రంలో పెట్టాను. అందుకే ఈ చిత్రానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది.నా సెమి ఆటోబయోగ్రఫి అనొచ్చు. ముఖ్యంగా కంపాటిబిటిలి అనేది లైఫ్ టైమ్ కావాలనేది ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం.
హైలైట్స్...
నిజజీవితంలో ఉండే సన్నివేశాలు, సంభాషనలు మాత్రమే ఈ చిత్రంలో కనిపిస్తాయి. కథానుగుణంగా మాత్రమే పాటలుంటాయి. నా అన్ని సినిమాల్లో కన్నా ఎక్కువ పాటలు ఈ చిత్రంలో ఉన్నాయి. సాహిత్యానికి తగ్గట్టు కళ్యాణి కోడూరి చక్కని సంగీతం అందించారు. సందేశాలు, ఉపన్యాసాలు లేకుండా కేవలం పాత్ర మాటల ద్వారానే ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది చెప్పాం.
హీరోయిన్‌కి తల్లిగా మధుబాల...
15 ఏళ్ళ తరువాత మధుబాల మళ్లీ చిత్రంతో రీ- ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్‌కి తల్లిగా నటించారు. చిన్న వయస్సులో పెళ్ళైపోయి కెరియర్‌లో అనుకున్న ఆశయాలు నెరవేరని తల్లి పాత్ర చేశారు. అద్భుతమైన నటన కనబర్చారు. రోహిణిగారు ఇప్పటివరకు చేయని క్యారెక్టర్‌లో కనిపిస్తారు.
సెన్సిటివ్ సబ్జెక్ట్స్ మాత్రమే చేయడానికి కారణం...
ప్రయత్న పూర్వకంగా ఇలాంటి సినిమాలు చేయట్లేదు. బేసిక్‌గా నాకు ఇటువంటి కథలంటే ఇష్టం. నాకు రైటర్స్ లేరు. నేను మొత్తం రాసుకుంటాను. దాంతో కొంచెం లేట్‌గా నా సినిమాలొస్తాయి. నా చిత్రాలు చూసినట్లయితే ఏదీ కూడా రిపీట్ జోనర్ ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో సినిమా జోనర్‌లో తీశాను. నేను చేస్తున్న ఫస్ట్ రొమాంటిక్ మూవీ ఇది. నెక్ట్స్ సినిమా ఇంకొంచెం కొత్తగా ట్రై చేస్తాను.
యాక్షన్ సినిమా చేసే అవకాశం ఉంది
యాక్షన్ సినిమాలంటే ఇష్టం.ఈజీ ఫార్మెట్‌లో తీయోచ్చు. కానీ ఎక్కువ బడ్జెట్ అవుతుంది. రొటీన్‌గా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో యాక్షన్ మూవీ చేస్తాను. నా దగ్గర చాలా యాక్షనఖ కథలున్నాయి. సమయం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫిజికల్ వయలెన్స్ అనేది నాకు కొంచెం బోర్‌గా ఉంటుంది. అందుకే ఆ జోనర్‌ని టచ్ చెయ్యను.
స్పూర్తి వేరు...కాపీ వేరు...
ఇప్పటి వరకు నేను చేసిన కథలన్ని నవలలు, ఇంగ్లీష్ నాటకాల స్పూర్తి, కొన్ని కథలను ఆడప్ట్ చేసుకుని తెరకెక్కించాను. వేరే సినిమాల కథలను కాపీ కొట్టి ఇతరుల ఐడియాలను మన ఐడియాలని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను రైటర్స్‌ని పెట్టుకోను. నేను ఒక్కడినే రాసుకుంటాను. ఏదో ఒక సినిమా తీసేసి తెలివిగల ప్రేక్షకులను, డబ్బు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులను అవమానించడం నాకు ఇష్టం ఉండదు. మనం చెప్పబోయేది ప్రేక్షకులకు ఈజీ వేలో అర్ధమయ్యేలా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళే వరకు తలుచుకుంటు ఉండేలా సినిమాలుండాలనేది నా అభిప్రాయం. అందుకే వీలైనంతగా సరళంగా నా సినిమాలు ఉండేలా జాగ్రత్త పడతాను.
తదుపరి చిత్రం
బుచ్చిబాబు రచ్చించిన 'చివరకు మిగిలేది' నవలను సినిమాగా తీయాలని ఉంది. కానీ అది చాలా కషట్తరమైన పని. చెయ్యడానికి ప్రయత్నిస్తా.
No comments:
Post a Comment