'వినాయక్' ఎక్కడ ?
టాలీవుడ్ దర్శకులలో ఒకరైన 'వి.వి.వినాయక్' గుర్తున్నారా ? చిరంజీవితో 'ఠాగూర్', బాలకృష్ణ తో 'చెన్నకేశవ రెడ్డి', 'దిల్', అల్లు అర్జున్ తొలి మాస్ హిట్ 'బన్ని' ఇలాంటి హిట్లు
సాధించిన 'వినాయక్' ప్రస్తుతం ఎవరికీ కనిపించడం లేదంట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతర దర్శకులు దూసుకెళ్తుంటే వినాయక్ ఎందుకు ముందుకు రావడం లేదని టాలీవుడ్ లో చర్చ జరుగుతోందంట. కారణమేమిటంటే 'బెల్లంకొండ శ్రీనివాస్' కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడని టాలీవుడ్ టాక్. ఓ స్మాల్ హీరో కోసం కథ రెడీ చేయాలని బెల్లకొండ శ్రీనివాస్, వివి వినాయక్ ను కోరాడని తెలుస్తోంది. అందుకొరకే వినాయక్ కనిపించడం లేదని సమాచారం. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నా ఈ సినిమా కోసం పది కోట్ల పారితోషకం తీసుకున్నాడని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నారు. కథ ఎప్పుడు ఒకే కావాలి.. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది.
No comments:
Post a Comment