Thursday, August 15, 2013

దేశవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు..

భరత జాతి జాగృతమైంది.. దేశం యావత్తూ ఉద్విగ్నమైంది.. భరత మాత దాస్యశృంఖలాలను తెంచేందుకు ప్రాణాలను అర్పించిన, రక్తాన్ని ధారపోసిన త్యాగధనులను కీర్తించింది. బ్రిటీష్ మూకల పీడ వదిలించి,భారతీయులు స్వేచ్ఛావాయువులు
పీల్చేందుకు ఉద్యమించిన వీరికిశోరాల విప్లవ గాధల్ని మరోసారి మననం చేసుకుంది. వారి స్మృతి చిహ్నాలను తమ హృదయాల్లో పదిలంగా భద్రపరుచుకుంటామని, వారి చూపిన బాటలో ముందుకు సాగుతామని బాసలు చేసింది...
ఎర్రకోటపై..
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బాపు ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన త్రివిద దళాధిపతుల గౌరవ వందనం స్వీకరించారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్వాగతం పలికారు. అనంతరం ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించినంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు. దేశ ప్రజలకు 67వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ,ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
పేదలందరికీ సంక్షేమ ఫలాలు : సిఎం
 సికింద్రాబాద్ : నిజాయితీగా అన్ని రంగాల్లో పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం.. పేదలను ఆదుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. పేదల జీవితాల్లో తాము పెనుమార్పులను తీసుకొచ్చామన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచామని, 1.56 లక్షల పేదలను చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చామని సిఎం పేర్కొన్నారు. 72వేల కోట్ల రుణాలను రైతులకు కేటాయించినట్లు..అలాగే164 కోట్ల చైనేత రుణాలను మాఫీ చేశామన్నారు. నిధులు కేటాయించి ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజలో ఉన్నామని, పేదలకు 64 లక్షల ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇచ్చామని తెలిపారు.అంతేగాక 82 వేల ఉద్యోగాలను కల్పించామని, లక్షా 34వేల మంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు అవకాశాలను అందించినట్లు సిఎం కిరణ్ తెలిపారు. ఈ ఏడాది 3లక్షల 57వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఉన్నత విద్యకై విదేశాల్లో చదువు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందిస్తున్నామన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటేనే మహిళాభివృద్ది జరుగుతుందని వారి కోసం 16,500 కోట్లు కేటాయించామని చెప్పారు. మహిళా గ్రూపులకు రుణాలివ్వడం జరుగుతోందని, దీనికి వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని గుర్తు చేశారు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం 'బంగారు తల్లి' పథకాన్ని తేవడం జరిగిందని, మూడో దశ రచ్చబండతో 20 లక్షల కుటుంబాలకు రక్షణ చేకూరిందన్నారు. ఇందిరమ్మ బాట సందర్భంగా 12 జిల్లాలో చేసిన పర్యటనలో ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి హామీనిచ్చారు.
ప్రజలకు శుభాకాంక్షలు : బాబు
ఎన్టీఆర్ భవన్ లో టిడిపి అధినేత చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.  ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేశారు. టిడిపి సీనియర్ నేత లాల్ జాన్ పాషా మృతి పట్ల ప్రసంగం చేయడం లేదని బాబు తెలిపారు.
మహనీయుల త్యాగ ఫలం : బొత్స హైదరాబాద్ : పోరాటాలు, త్యాగాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవమని పిసిపి అద్యక్షుడు బొత్స పేర్కొన్నారు. ఆ పోరాటంలో ఆశువులు బాసిన మహనీయులను స్మరించుకుంటూ నేడు ఈ వేడుకలను జరుపుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. వారు చేసిన ఆందోళనలు, ఉద్యమాలు మనందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఎం కిరణ్ కుమార రెడ్డి, డిప్యూటి సిఎం దామోద రాజనర్సింహ, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.'తెలంగాణ'పోరాట ఫలితమే : నాయిని తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యోగుల, విద్యార్థుల పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన ఏర్పాటవుతుందని అన్నారు.గాంధీకి స్పీకర్ నివాళి
అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ జెండా ఎగురవేశారు. అంతకు ముందు గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి బిజెపి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.}స్వాతంత్ర్య వేడుకల్లో వట్టిపశ్చిమ గోదావరి : జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండా ఎగిరింది. పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత్ కుమార్ పరేడ్ గ్రౌండ్స్ లో జెండాను ఎగుర వేశారు. ఈకార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment