తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కొచ్ఛాడియన్'. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేఎస్ రవికుమార్ కథను రజినీ కూతురు సౌందర్య 'కొచ్చడయాన్' గా తెరకెక్కిస్తున్నారు. సౌందర్యకు, కెఎస్ రవికుమార్ లకు ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదట. దీంతో రజినీ కాంత్ తన బాల్య స్నేహితుడు కమల్ హాసన్ ను సహాయం కోరాడని సమాచారం. అడిగిందే తడవుగా ప్రొడక్షన్స్ కు సంబంధించిన పలు కీలక విషయాల్లో కమల్ సలహాలు ఇచ్చాడట. అంతే కాకుండా, టెక్నికల్, సీన్ టేకింగ్ లో కొన్ని మెలకువలు నేర్పించాడని సమాచారం. అయితే ఇంతకు ముందు కమల్ 'విశ్వరూపం' విడుదల సమయంలో కష్టాల్లో ఉన్న కమల్ కు రజినీ హెల్ప్ చేసిన విషయం తెలిసిందే. 'రజినీకాంత్' రోబో హక్కులు తెలుగులో రూ.22 కోట్ల అమ్ముడుపోగా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఇదొక్కటి చాలు సౌతిండియన్ సూపర్ స్టార్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఏంటో. తమిళంలో రూపొందే ప్రతి రజినీ సినిమా తెలుగులోనూ రావడం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అలా వచ్చి ఇక్కడ కమర్షియల్ సక్సెస్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అదే కోవలో వస్తోంది యానిమేషన్ సినిమా 'కొచ్చాడియాన్'. తెలుగులో 'విక్రమ సింహా' పేరుతో రీమేక్ అవుతోంది. 'దీపికా పదుకొనే రజినీకి జంటగా నటిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తైన కొచ్చడయాన్ తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. దాదాపు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో 'విజువల్ గ్రాండియర్'గా రూపొందుతున్న కొచ్చాడియాన్ ఓ అరుదైన చిత్రంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 'మోషన్ క్యాప్ఛర్' విధానంలో కొచ్చాడియాన్ ను తెరకెక్కిస్తుండటం విశేషం. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న 'విక్రమ సింహా' దీపావళికి విడుదలకు సిద్ధమవుతోంది.
సో.. కమల్ సలహాలు రజినీ ఎలా ఉపయోగపడతాయో చూడాలి.

No comments:
Post a Comment