ఢిల్లీ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపిలు రాజీనామా చేశారు. వీరంతా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు సమర్పించారు. ఇప్పటి వరకు 8 మంది లోక్ సభ ఎంపిలు స్పీకర్ మీరాకుమార్ కు రాజీనామా లేఖను సమర్పించగా, రాజ్యసభ ఎంపి కెవిపి తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందించారు. రాజీనామా చేసిన వారిలో లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి,హర్షకుమార్, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, సబ్బంహరి, రాయపాటి, ఎస్ పి వై రెడ్డి, కెవిపి రామచంద్రరావు ఉన్నారు. వీరిలో సబ్బంహరి, రాయపాటి, ఎస్ పి వై రెడ్డి తమ రాజీనామా లేఖలను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇక రాజీనామా బాటలో ఉన్న మంత్రులు పురందేశ్వరి, కిల్లి కృపారాణి, పల్లంరాజు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రేపు ప్రధానితో ఓసారి సమావేశమై తర్వాత తుది నిర్ణయంతీసుకుంటారని తెలుస్తోంది.

No comments:
Post a Comment