Wednesday, August 7, 2013

హైదరాబాద్: ఆర్టీసీ తెలంగాణ మజ్జూర్ యూనియన్ (టిఎంయూ) సమ్మె సైరన్ మోగించింది. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనే ప్రధాన డిమాండ్ తో ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు టిఎంయు నేతలు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకే నేషనల్ మజ్జూర్ యూనియన్ (ఎన్ఎంయు)సమ్మెకు దిగిందన్నారు. కేశినేని, జె.సి.దివాకర్ ట్రావెల్స్ కనుసన్నల్లోనే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్(ఇయు), ఎన్ఎంయు పనిచేస్తున్నాయని ఆరోపించారు. 

No comments:

Post a Comment