Tuesday, August 6, 2013

చైనాలో ఎత్తైన ఎయిర్ పోర్ట్..

బీజింగ్ : టెక్నాలజీలో మరో అద్భుత ఆవిష్కరణతో చైనా దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన పౌర విమానాశ్రయం నిర్మించేందుకు సమాయత్తమైంది.  హిమాలయ ప్రాంతం సమీపంలో
టిబెట్‌లో ఈ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 4,411 మీటర్ల ఎత్తు వరకు డోచెంగ్‌ యాడింగ్‌ ఎయిర్‌పోర్టును చైనీయులు నిర్మించనున్నారు.
 సియాచిన్‌లోని గార్జిలో ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు చైనా శ్రీకారం చుట్టినట్లు గ్జిన్‌హూ న్యూస్‌ ఏజెన్సీ రిపోర్టులో ప్రకటించింది. టిబెట్‌ పరిసర ప్రాంతంలో ఇప్పటికే చైనా ప్రభుత్వం 5 ఎయిర్‌పోర్టులను నిర్మించింది.గంగ్గార్‌, లాసా, బంగ్దా, గ్జియాజే, నగారి విమానాశ్రయాలను నెలకొల్పింది. నైరుతి చైనా సమీపంలోని ఖమ్డోలో నిర్మించిన బంగ్డా ఎయిర్‌పోర్ట్ సముద్రమట్టానికి 4,334 మీటర్ల ఎత్తులో ఉంది. కొత్తగా నిర్మించనున్న  4,411 మీటర్ల ఎత్తులో ఉండటనుండటంతో బంగ్డా రికార్డును ఇది అధిగమించనుంది. జూన్‌ 22న సాంకేతిక కారణాలతో బంగ్డా ఎయిర్‌పోర్టును మూసివేసి మరమ్మతు పనులు చేపట్టారు. 19 ఏళ్ల క్రితం కూడా మరమ్మతులు జరిగాయని సివిల్ ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు.
పనుల్లో వివిధ శాఖలు...
 
మరోవైపు భౌగోళిక సమస్యలను అధిగమించేందుకు చైనా ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే ప్రత్యేక దళాలతో సామాగ్రిని తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా చైనాలోని రైల్వే, రోడ్డు రవాణా శాఖలకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఇక ఈ డోచెంగ్‌ ఎయిర్‌పోర్టు రెండు రూట్లలో సేవలు అందించనుంది. మొదటిది ఖమ్డో-లాసా, రెండోదిఖమ్డో-చెంగ్డూ. మొత్తానికి ఈ ఎయిర్‌పోర్టు ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ముస్తాబై ముందుకు వస్తోంది.

No comments:

Post a Comment