Wednesday, August 7, 2013

మహేష్ బాబు తల్లి పాత్రలో అను హాసన్?


హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘1'(నేనొక్కడినే). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో అను హాసన్ మహేష్ బాబుకు తల్లి పాత్రలో నటిస్తోందట. అను హాసన్ ఎవరో కాదు...ప్రముఖ నటి సుహాసిని చెల్లెలు. ఈ చిత్రంలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రను అతని కొడుకు గౌతం పోషిస్తున్నాడు. గౌతంకు తల్లిగా ఆమె పాత్ర ఉంటుందని, పెద్దయిన తర్వాత మహేష్ బాబుకు తల్లి పాత్రలో ఆమె కనిపిస్తుందని అంటున్నారు. అయితే అను హాసన్ నటిస్తుందా? లేదా? అనే విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. 1 నేనొక్కడినే   | మహేష్ బాబు   అను హాసన్ గతంలో తెలుగులో రెండు మూడు చిత్రాల్లో కనిపించింది. ‘ఎవరైనా ఎపుడైనా' చిత్రంలో వరుణ్ సందేష్‌కి వదిన పాత్రలో, ‘ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో రామ్‌కు మేనత్త పాత్రలో నటించింది. నటన పరంగా ఆమెకు ప్రతి సనిమాలోనూ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలే అందాయి. డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్, చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు. క్రితి సానన్ హీరోయిన్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


No comments:

Post a Comment