'మంచు మనోజ్', దర్శకుడు 'పవన్' కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'పోటుగాడు'. 'రామలక్ష్మీ సినీ క్రియేషన్' బ్యానర్ పై శిరీష, శ్రీధర్ లగడపాటి నిర్మించారు. సంగీతం 'అచ్చు'. ఈ సినిమా 'ఆడియో విడుదల'హైదరాబాద్ లోని అన్నపూర్ణ సెవెన్
ఎకర్స్ లో జరిగింది. ఈ సినిమా పాటలు మార్కెట్ లో దుమ్మురేపుతున్నాయి. కొత్తగా తెరంగేట్రం చేసిన సంగీతం దర్శకుడు 'అచ్చు'. తన మ్యూజిక్ సోషల్ నెట్ వర్క్ లోనూ హవా కొనసాగిస్తోంది. 'పోటుగాడు' ఆడియో రిలీజ్ విడుదలై కేవలం రెండు రోజులే అవుతున్నా.. పాటలకు ఇంతగా స్పందన వస్తుండడంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపిగా ఫిలవుతోంది.
మనోజ్ ఆల్ రౌండర్.. ఆడియో రిలీజ్ లో దాసరి..
పోటుగాడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి మాట్లాడుతూ.. ' మనోజ్ చిన్ననాటి నుంచి నేను చూస్తున్నా. అతన్ని చాలా సార్లు ఎత్తుకొని తీరిగే వాడిని, కానీ ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడు. అప్పుడు మనోజ్ అల్లరి పిల్లాడు అవుతాడనుకున్న.. కానీ ఆల్ రౌండర్ అవుతాడనుకోలేదు. తన తండ్రి వారసత్వంలో నుంచి సినిమాలకు కావాల్సిన అన్ని లక్షణాలను, కళ నైపుణ్యాలను వెంటబెట్టుకొని వచ్చాడు. ఈ సినిమాలో తను చేసే నటనను చూసి నాకు ఆశ్చర్యమేసింది. మనోజ్ ఒక్క నటుడిగానే కాదు.. కథ రచయితగా, పాటల రచయితగా, సింగర్ గా, ఓ నిర్మాతగా, మరో ఫైట్స్ మాస్టర్ గా అన్ని రకాల కళలు వంటబట్టించుకున్నాడు. తను నటించిన ఈ చిత్రం ఓ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.'' అని అన్నారు. హీరో మోహన్ బాబు మాట్లాడుతూ.. '' మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం అభిమానులే. నా దృష్టిలో వారే నిజమైన దేవుళ్లు, వారి వల్లనే సినిమా ఇండస్ట్రీ నడుస్తోంది. 'పోటుగాడు'లో మనోజ్ నటన అద్భుతంగా ఉంటుంది. నిర్మాత శ్రీధర్ ఇతర భాషాలో హిట్ అయిన సినిమాను మనోజ్ తో చేయడం చాలా సంతోషం. వారికి కృతజ్ఞతలు. దర్శకుడు పవన్ నాకు చాలా దగ్గరివాడు ఆ సన్నిహిత్యంతోనే ఈ సినిమా చేశాడు. పవన్ ఎప్పుడూ చాలా కొత్తగా ఆలోచిస్తాడు. దీనికి నిదర్శనమే ఈ పోటుగాడు. సంగీతం చాలా బాగుంది. 'అచ్చు'కి ప్రేత్యేకంగా అభినందనలు. తను సంగీతం కోసం ఎప్పుడూ పరితపించే వ్యక్తి. పాటలు కచ్చితంగా హిట్ అవుతాయి.''అని అన్నారు. దర్శకుడు పవన్ మాట్లాడుతూ.. '' మనోజ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. షూటింగ్ లో నాకు చాలా సహకరించాడు.''అన్నారు. హీరో మనోజ్ మాట్లాడుతూ.. '' ప్రేమించుకున్న వ్యక్తులు వారి ప్రేమ విఫలమైతే ఏం చేస్తారో అన్నా కాన్సెప్ట్ తో తీసిన చిత్రం ఇది. ప్రేమలో ఫేయిల్ అయి సూసైడ్ చేయాలనుకుంటే ఢిల్లీ కి వెళ్లిపోయి ఆర్మీలో ట్రైనింగ్ తీసుకొని దేశం కోసం చనిపోండి. అంతే కానీ తల్లిదండ్రులకు దు:ఖాన్ని మిగల్చవద్దు. అనేది నేను ఈ సినిమా ద్వారా ఇచ్చే సందేశం. ఇక సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తోన్నారు. వారిలో సాక్షి చౌదరీ, సిమ్రాన్, రేచల్, అనుప్రియ. చాలా కష్టపడి డెడికేటింగ్ గా పనిచేశారు. సినిమాను అద్భుతంగా చూపించడానికి నిరంతరం శ్రమించిన టెక్నిషియన్స్ కు కృతజ్ఞతలు. ఈ సినిమా మంచి మెసేజ్ ఇచ్చేదిగా ఉంటుంది''. అని అన్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన హీరోలు నాగచైతన్య, వరుణ్ సందేశ్, శర్వానంద్,సునీల్, తనీష్, అల్లరి నరేష్ మాట్లాడుతూ.. కొత్తదనం కోరుకునే హీరో మనోజ్ ఒక నటుడే కాదు. మాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందన్నారు. ఈ ఆడియో కార్యక్రమంలో అగ్ర నటి, ఎమ్మెల్యే జయసుధ, కీరవాణి, లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు, ఛార్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment