హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వస్తున్న బాలీవుడ్ సినిమా 'క్రిష్-3'. ఈ సినిమా హృతిక్ తండ్రి రాకేష్ రోషన్
దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సినిమాలో 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని సమాచారం. ఇదే విషయాన్ని అమితాబ్ తన బ్లాగులో వెల్లడించారు. చిత్రంలోని పలు కీలక సన్నివేశాల్లో అతని వాయిస్ ఉంటుందట. అయితే బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన అమితాబ్ వాయిస్ పెడితే బాగా సూట్ అవుతోందని భావించిన యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట. 'క్రిష్-3'లో 'వివేక్ ఒబెరాయ్' విలన్ పాత్రలో నటిస్తున్నాడు. చిత్రంలో హృతిక్ 'సూపర్ మాన్' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment