Monday, August 19, 2013

ఇక.. పూరీ సినిమాలు 'టూరింగ్ టాకీస్' లో!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు 'పూరి జగన్నాథ్'. ప్రస్తుతం ఫ్లాపులను మూటగట్టుకుంటున్నాడు. దీంతో ఆయనలో కొంత జోష్ తగ్గినా
తనదైన స్టైల్ మాత్రం వదల్లేదు. మాటలతో మాయ చేసి యూత్ ను ఉర్రూతలూపడం పూరీకి డైలాగ్స్ తో పెట్టిన విద్య. ఇక నిర్మాతగా కూడా మారిన పూరీ 'వైష్ణో అకాడమీ' బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. వీటిలో 'ఇడియట్', 'అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' లాంటి సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే.. కొంత కాలంగా హిట్ అనే మాట పూరీకి చాలా దూరంగా ఉంటోంది. దీంతో స్టార్ హీరోలంతా ఆయనకు దూరంగా ఉంటున్నారు. దీంతో.. చిన్న సినిమాలు తీసుకునే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా నితిన్ తో 'హార్ట్ ఎటాక్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే.. తన బ్యానర్ కు దిష్టి తగిలిందనుకున్నాడో..? లేక పేరు మార్చితేనైనా 'ఫేట్' మారుతుందని భావించాడో గానీ.. తన 'వైష్ణో అకాడమీ' బ్యానర్ ను కాస్తా.. 'పూరీ టూరింగ్ టాకీస్' గా మార్చేశాడు. ఇక నుంచి కొత్తగా వచ్చే సినిమాలన్నీ ఈ బ్యానర్ పైనే నిర్మిస్తాడట. అంతే కాక ఈ బ్యానర్ పై యాడ్ మేకింగ్, ఫిల్మ్ స్కూల్, ప్రొడక్షన్ తో పాటు ఓ కార్పొరేట్ కంపెనీ కూడా ఏర్పాటు చేయబోతున్నాడట. దీంతో టాలీవుడ్ లో 'పూరీ టూరింగ్ టాకీస్' హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా 'హార్ట్ ఎటాక్' తో ఓ సూపర్ హిట్ కొడితే.. మళ్లీ స్టార్ హీరోలంతా తనతో సినిమా చేసేందుకు క్యూ కడతారని భావిస్తున్నాడు. మరోవైపు 'మంచు విష్ణు' తో 'అసెంబ్లీ రౌడీ' రీమేక్ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నాడు. సో.. కొత్తగా వచ్చిన టూరింగ్ టాకీస్ తో.. పూరీ ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

No comments:

Post a Comment