ఉల్లి మేలు మాట దేవుడెరుగు
హైదరాబాద్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు.... మేలు మాట దేవుడెరుగు.. ఇప్పుడు ఉల్లి పేరు వింటేనే
కన్నీళ్లొచ్చేస్తున్నాయి. కోయకముందే ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. సామాన్యులనే కాదు పెద్ద పెద్ద హోటల్ యజమానులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో హోటల్ యజమానులు ఆ భారాన్ని వినియోగదారులపై వేసేస్తున్నారు. కొండెక్కిన ఉల్లి ధరతో హోటల్స్, బజ్జీల బళ్లలో ఉల్లి మాయమైపోయింది
ఉల్లితో కలవరం...
ఉల్లి ధర హైదారాబాదీలను కలవరపెడుతోంది. హోటల్స్ లో ఉల్లి పాయల భారాన్ని వినియోగదారునిపైకే నెట్టేస్తున్నారు. ఇంతకు ముందు బిర్యానీతో పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఇచ్చే హోటల్స్ ఇప్పుడు సలాడ్స్ పై విడిగా ధర వేస్తున్నాయి. ఆనియన్ కావాలంటే అదనంగా 10 రూపాయలు కడితేనే ఇస్తామని తేల్చి చెప్పేస్తున్నాయి. ఉల్లిధర పెరగడంతో దానిని ఉపయోగించడం లేదని... అవసరమనుకుంటే దానికి విడిగా బిల్లు వేస్తున్నామని హోటల్ యజమానులు చెబుతున్నారు. వ్యాట్ టాక్స్ మాదిరిగానే ఇప్పుడు హోటల్ లో ఉల్లిపై టాక్సు కూడా అమలవుతోందని తెలియడంతో వినియోగదారులు హడలెత్తిపోతున్నారు.
రుచిలేని తిండితో సరి...
ఉల్లి లేని కూర ఊహించలేము... మరి ఉల్లితో చేసిన దోశ, ఉల్లి బజ్జీ .. అబ్బ ఆ రుచే వేరు. ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది. ఇప్పుడు ఆ పేరు వింటే ప్రాణం పోయేంత పరిస్థితి వచ్చింది. ఉల్లి ఘాటు ఇప్పటికే 70కి చేరడంతో దానిని కొనటానికి ఎవ్వరూ సాహసించటం లేదు. ఉల్లి ఘాటుతో బజ్జీల బండ్లపై ఉల్లి పూర్తిగా మాయమైంది. దీంతో ఏ మాత్రం టేస్టు లేని అట్టు, బజ్జీలతో వినియోగదారుడు సరిపెట్టుకోవాల్సివస్తోంది.

No comments:
Post a Comment