Saturday, August 17, 2013

ఇంటి వైద్యం


 
 ఇంటి వైద్యం
జుట్టును సంరక్షించుకోవడంలో మనం చేయని ప్రయోగాలంటూ ఉండవు. ఎందుకంటే జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కాబట్టి. జుట్టు సంరక్షణకు ఉపయోగించడానికి అనేక బ్యూట్రీ వస్తువులు(పదార్థాలు)ఉన్నాయి. అటువంటి బ్యూటీ వస్తువులు, పెరుగు, నిమ్మ, ఆయిల్, లేదా ఉడికించిన మందార పువ్వులు వంటివి మాత్రమే జుట్టు సంరక్షణలో ఉపయోగపడే పదార్థాలని మీరు అనుకుంటే, మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే మన వంటగదిలో మనకు తెలియకుండా మన జుట్టుకు ఉపయోగపడే పదార్థాలు అనేకం ఉన్నాయి. వాటిని ఉపయోగించి మన జుట్టుకు సరైన సంరక్షణ కల్పించవచ్చు. ఈ పదార్థాలను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను, జుట్టు రాలడంతో సహా, చుండ్రు, పొడి జుట్టు, తలదురద వంటి మరికొన్ని సమస్యలను నివారించుకోవచ్చు. జుట్టు సంరక్షణ పదర్థాలు ఉసిరి, క్యాస్ట్రో ఆయిల్(ఆముదం), గుడ్డు, పెరుగు, వెనిగర్, నిమ్మ, మెహింది, వేపఆకులు, ఆలివ్ ఆయిల్ మొదలగునవి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. ఈ పదార్థాలు వివిధ జుట్టు సమస్యలకు చికిత్సకోసం హోం నివారణలుగా ఉపయోగిస్తాం. ఉదా: వేప ఆకులు చుండ్రు మరియు జుట్టు రాలే సమస్యలను నివారించడం కోసం ఉపయోగిస్తాం. అలాగే మెహిందిని కూడా జిడ్డుగా ఉన్న జుట్టు, మరియు రాలే జుట్టు నివారణల కోసం ఉపయోగిస్తుంటాం. ఇక వెనిగర్ మరియు గుడ్డు జుట్టు సంరక్షణ పదార్థాల్లో ఇవి కూడా అద్భుతమైనవి జుట్టును మృదువుగా మరియు మందగా పెరిగేందుకు ఉపయోగపడుతాయి . కాబట్టి ఆర్టిఫిషియల్ హెయిర్ ప్రొడక్ట్స్ కోసం డబ్బు వృధా చేయడం కంటే, ఇంట్లో లభించే ఇటువంటి ప్రభావంతమైన వస్తువులను ఉపయోగించి జుట్టును సంరక్షించుకోండి. 
మరి మన ఇంట్లో దొరికే 20 హెయిర్ కేర్ పదార్థాలు
ఆమ్లా(ఉసిరి): దీన్నే ఇంగ్లీష్ లో గూస్బెర్రీ అంటారు, జుట్టు రాలడాన్ని, చుండ్రతో పోరాడి మరియు జుట్టు అంటువ్యాధులను తగ్గించడంలో ఒక అద్భుతమైన పదార్థం ఉసిరికాయ. కాబట్టి ఉసిరికాయ పొడి లేదా ఉడికించి పేస్ట్ చేసి పెరుగులో మిక్స్ చేసి ఉసిరికాయ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్ గా ఉపయోగించుకోవచ్చు.

No comments:

Post a Comment