Friday, August 23, 2013

ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం


ముంబయి : దారుణం..అతివలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముంబాయిలోని పారెల్ ఏరియాలో ఫొటో జర్నలిస్టు (23) పై దుండగులు గురువారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు ముంబయి లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే ఇద్దరి నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మహరాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ పరామర్శించారు. అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు.
           ఇంగ్లీషు మ్యాగ జైన్ లో ఓ యువతి ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఓ స్టోరీ నిమిత్తం గురువారం రాత్రి 8 గంటల సమయంలో పారెల్ ఏరియాకు వెళ్లారు. అక్కడున్న ఐదుగురు నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను అడ్డుకోబోయిన ఆమె స్నేహతుడిపై దుండగులు దాడి చేశారు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు. స్నేహితుడి చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చికిత్స పొందుతున్న బాధితురాలి నుండి వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments:

Post a Comment