Sunday, August 25, 2013

'అనుష్క'కు నిద్ర లేదట..!

'యోగా బ్యూటీ' అనుష్క 31 సంవత్సరాలు వచ్చినా 'చెక్కిన శిల్పం'లా చూసే వారికి చాలా హాట్ గా కనిపిస్తోంది. అది ఆమె స్పెషాలిటీ. అనుష్క పని అయిపోయింది
అని వార్తలు వస్తున్న నేపధ్యంలో తన సత్తా ఏమిటో చూపెడుతూ ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ తన రేంజ్ చూపెడుతోంది. ప్రస్తుతం అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో ‘రాణి రుద్రమ’, రాజమౌళి దర్శకత్వం లో ‘బాహుబలి’ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ అనుష్క ను ఖంగారు పెడుతున్నాయి. 'రాణి రుద్రమ'లో మహారాణిపాత్రలో చాలా రాజసంగా కనిపించడం కోసం తన శరీర ఆకృతిని మలచుకోంటుందట. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమాకు సంబంధించి రాజకుమారి పాత్ర కాబట్టి సన్నగా, నాజుకుగా కనిపిస్తూ ఒక అందాల రాజకుమారి గా వెండితెరపై మెరవాలి. ఈ రెండు పాత్రలు ఎంత విభిన్నమైనవో అలాగే ఈ రెండు పాత్రకు సంబంధించిన శరీర ఆకృతి కూడా చాలా భిన్నంగా ఉండాలి. ఇలా ఈ రెండు సినిమాలలో కనిపించడం కోసం మన యోగా బ్యూటీ తన బరువు తగ్గించుకోవడమే కాక ఒక స్పెషల్ ఫిజికల్ ట్రైనర్ ను పెట్టుకొని వ్యాయామం చేస్తుందట. దీంతో ఒకే సారి రెండూ క్యారెక్టర్ లో ఇమడడం కోసం చేసే ప్రాక్టిస్ ల వల్ల ఆమెకు నిద్ర పట్టటం లేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మన స్వీటీ పడుతున్న కష్టాలను ఈ దర్శకులు ఇద్దరు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.

No comments:

Post a Comment