హైదరాబాద్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి సస్పెన్షన్‌కు గురైన విజయశాంతి గురువారం బహిరంగ లేఖ రాశారు. తనకు సస్పెన్షన్ షోకాజ్ నోటీసు
అందలేదని, అది అందాక తాను స్పందిస్తానని అందులో పేర్కొన్నారు. ఆరేళ్లు తెరాసలో పని చేసేందుకు అవకాశం ఇచ్చిన అన్న, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తనకు షోకాజ్ నోటీసు అందిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. అమరవీరుల త్యాగ ఫలితం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. మెదక్ ప్రజలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. కార్యకర్తలు ఎవరు కూడా ఆవేశాలకు లోనుకావద్దని, సంయమనం పాటించాలని ఆమె హితవు పలికారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆమె అనుచరుడు రఘువీర్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నరాు. అలాంటప్పుడు వేటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు. కాగా, విజయశాంతి పైన తెరాస సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతికి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. కాంగ్రెసులో చేరడానికి ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయశాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం అర్ధరాత్రి తర్వాత తెరాస పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.

No comments:
Post a Comment