ఢిల్లీ: నాలుగు నెలల్లో రాజ్యాంగ బద్ధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన
మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 1956 నుంచే తెలంగాణ డిమాండ్ ఉందని, అందుకే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించామన్నారు. తెలంగాణ ప్రకటనతో ఇతర ప్రాంతాల్లోనూ తలెత్తుతున్న డిమాండ్లను ప్రస్తావించగా.. వాటిని తెలంగాణతో పోల్చి చూడకూడదన్నారు. మహారాష్ట్రలోని విదర్భ కన్నా ముందు నుంచే తెలంగాణ డిమాండ్ ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రాలు కోరుతున్న వారు శాంతి యుతంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేయాలన్నారు. సీమాంధ్రలోని జరుగుతున్న ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని, అయితే.. వారు తమ డిమాండ్లను ప్రజాస్వామ్యయుతంగా వ్యక్తం చేయాలన్నారు. ఈ పదేళ్లలో హైదరాబాద్ పై అధికారం ఎవరిది అ న్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. తెలంగాణలో పది జిల్లాలే ఉంటాయా..? ఇంకా కలిసివే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నకూ షిండే సరైన సమాధానం ఇవ్వలేదు. సీడబ్ల్యూసీ తరపున తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్రానికి నివేదించామని, అదే విధంగా తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు చర్చకు రాదని చెప్పారు. రెండో ఎస్సార్సీ ఆలోచన కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.
No comments:
Post a Comment