Thursday, August 1, 2013

జింబాబ్వే 144 ఆలౌట్


భారత్-జింబాబ్వే జట్ల మధ్య ప్రారంభమైన నాలుగో వన్డే మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 144 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా మరో విజయం దక్కించుకోవడానికి, జింబాబ్వే ఇంకో పరాజయాన్ని మూటగట్టుకోవడానికి లాంఛనం
సిద్ధమైంది. సెల్ కాన్ కప్ ఐదు వన్డేల సరీస్ లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల
మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు మరోసారి పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. భారత బౌలింగ్ ను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఫలితంగా 42. 4 ఓవర్లలో 144 పరుగులకే చాప చుట్టేసింది. జట్టులో చిగుంబుర మాత్రమే టీమిండియా బౌలర్లను ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చాలా కాలం తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న అమిత్ మిశ్రాతోపాటు, కొత్తగా జట్టులోకి వచ్చిన మోహిత్ శర్మ, సీనియర్ జడేజా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో జింబాబ్వే బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ఒకరి వెంట ఒకరు పెవిలియన్ కు క్యూకట్టారు. దీంతో జింబాబ్వే ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది.

No comments:

Post a Comment