Friday, August 30, 2013

మహిళలకు మెసేజ్ ఇచ్చే 'మైకం'!

'ప్రస్తుతం మన సమాజంలో జరుగుతోన్న సంఘటనల ఆధారంగా మహిళల కోసం తెరకెక్కించిన చిత్రం 'ప్రేమ ఒక మైకం'' అని నటి ఛార్మి అంటున్నారు. చందు దర్శకత్వంలో
'టూరింగ్ టాకీస్' పతాకంపై డి.వెంకట సురేష్, కె.సూర్య, శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ ఒక మైకం'. ఈ సినిమాలో ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె '10టివి'తో ప్రతేకంగా మాట్లాడుతూ...'' అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. యువతకు అమ్మాయి మైకంలా.. మందుబాబులకు మందు మైకంలా.. ప్రేమికులకు ప్రేమ మైకంలా.. అన్ని వర్గాల వారికి ఇది ఓ మంచి మైకంలా ఉంటుంది. ఈ సినిమాలో నేను వేశ్య(మల్లిక)గా నటించాను. సినిమా అంతా.. ఓ వేశ్య, ఓ గాయకుడు, ఓ రచయిత మధ్య సాగే మ్యూజికల్ లవ్ స్టోరీ. నా నటన అందరికీ నచ్చేలా ఉంటుంది. మసాలా ఎక్కువగా ఉండదు. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాద్వారా అమ్మాయిలకు మంచి మెసేజ్ ఇచ్చాం. కనుక వారు కచ్చితంగా చూడాల్సిన చిత్రం. దీనిలో డైలాగ్ లూ సూపర్ గా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు.. అందరికీ నచ్చే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. 'చందు' డైరక్షన్ అద్భుతంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో 300థియేటర్లలో సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. దీన్ని నేను ఇమేజ్ కోసం కాకుండా కేవలం నటనకు, కథకు ప్రాధాన్యమిచ్చి చేశాను. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది'' అన్నారు.

No comments:

Post a Comment