రాం 'జోకర్' వర్మ
నా ఇష్టం.. నాకు నచ్చిందే చేస్తా అని చెప్పే రామ్‌గోపాల్ వర్మకు ఇప్పుడు తన కూతురినుంచి ఇవే మాటలు వచ్చేసరికి ఇరకాటంలో పడ్డాడట. వర్మ కూతురు 'రేవతి' పెళ్లి ఈనెల 15న జరిగింది. అసలు పెళ్లి,కట్టుబాట్లను నమ్మని వర్మ…
కూతురి పెళ్లిని మాత్రం ఘనంగా చేయాలనుకున్నాడట. తనకు హిందీ, తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో పరిచయాలుండటంతో.. అందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అయితే వర్మ కూతురు రేవతి మాత్రం… పెళ్లికి ముందు ‘'ఇది నా పెళ్లి, ప్రైవేట్ కార్యక్రమంగానే ముగియాలి. నాకు తెలియని ముఖాల మధ్య నేను పెళ్లి చేసుకోను, అందరినీ ఆహ్వానించక్కర్లేదని'' ఖరాఖండిగా చెప్పేసిందని టాక్. అయితే దీనికి స్పందించిన వర్మ. సినీ ప్రముఖులను పిలిచే ముందు తన ప్రత్యేకతను చూపించాడు. ఎవరైనా తన కూతురు పెళ్లికి ఆహ్వానించడమంటే కనీస పద్ధతులు పాటిస్తారు. కానీ వాటికి అతీతుడైన వర్మ మాత్రం కొత్తగా అతని స్టైల్లో ఇన్విటేషన్ పంపాడు. ఇంతకీ ఆ ఇన్విటేషన్ లో ఏముందో అనే కదా మీ డౌట్.. ‘‘ హాయ్ ఆగస్ట్ 15, 8:45 కు నా కూతురు పెళ్లి. ఇది నాకు తప్పించుకోలేని బాధ్యత. రాదలచుకుంటే మీరూ తప్పక రండి. కానీ దంపతులను ఆశీర్వదించడానికి కాదు. ఆ పెళ్లిలో నా జోకర్ అవతారాన్ని చూడటానికి''. అంటూ ఫినిష్ చేశాడు. ఈ ఆహ్వానం చూసిన వారు షాక్ తింటే, ఇక అతన్ని అభిమానించేవారు మాత్రం మా వర్మ అంతే ఏం చేసినా డిఫరెంట్ గానే ఉంటుంది అంటూ మురిసిపోతున్నారట. సో దట్ ఈజ్ వర్మ.
No comments:
Post a Comment