రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయనున్నట్లు శైలజానాథ్ ప్రకటించారు..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రకు చెందిన శాసన సభ్యులు రాజీనామా
చేయబోతున్నారని సీమాంధ్ర నేత శైలజానాథ్ ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు, అవకాశ వాద ధోరణితో వ్యవహరించి వైసిపి రాష్ట్రం ముక్కలయ్యేందుకు తోడ్పడ్డారని ఆరోపించారు. విభజన ప్రకటన ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయబోతున్నామన్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ముఖ్యమంత్రిని కలవనున్నట్లు చెప్పారు. మంత్రులంతా తమతో కలిసి రావాలని కోరారు.
No comments:
Post a Comment