అనంతపురం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న సీమాంధ్ర బంద్ వల్ల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో ఎటిఎంలు మూతపడడంతో ప్రజలు నానా
ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చిన విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. బంద్ లో భాగంగా టిఫిన్ సెంటర్లు, హోటల్స్ పూర్తిగా మూతబడ్డాయి. దీనితో విద్యార్థులు, ఇతర ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ నేపథ్యంలో తాము కూడా నష్టాలకు గురవుతున్నామని యజమానులు పేర్కొంటున్నారు. 
No comments:
Post a Comment