సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో హాస్యనటులకు అంతే క్రేజ్ ఉంటుంది. అది జోక్ అయినా.. సరసమైనా... సీరియస్ యాక్షన్ అయినా..., హాస్యాన్ని పండించే నటులను ప్రేక్షకులు ఎప్పుడూ అభిమానిస్తారు. అయితే ప్రసుత్తం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చెయ్యాలంటే మేమే అంటూ హీరోలు పోజు కొడుతుంటారు. కానీ ఈ ట్రెండ్ సెట్టర్స్ కూడా షాక్ తినేలా కామెడియన్స్ మరో ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. హీరోలకు పోటీగా ఫైట్ చేస్తున్నారు. వారు జెలసీగా ఫీలయ్యేలా సాంగులు పాడుకుంటున్నారు. దీంతో కమెడియన్స్ కి హీరోలకు ఈ విషయంలో పోటీ నెలకొంది. కమెడీయన్లు హీరోలుగా నటించిన చిత్రాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కామెడీ హీరోలూ చాలానే ఉన్నారు. వారిలో ప్రస్తుతం సునీల్, బ్రహ్మానందం, ఆలీ, వేణుమాధవ్, వెన్నెల కిషోర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లీస్టే అవుతోంది. అయితే వీరిలో కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే...
కమెడియన్ నుంచి హీరోగా..
టాలీవుడ్ లో కామెడీ రాజ్యాన్ని ఒకరిద్దరు కమెడియన్స్ ఏలుతున్న సమయంలో పూలచొక్కాతో ఎంటర్ అయి టాలీవుడ్ టాప్ కమెడియన్ అయ్యాడు 'సునీల్'. యంగ్ స్టర్ ఎవరైనా సినిమా చేస్తున్నారంటే, సునీల్ తప్పనిసరీగా ఉండాల్సిందే. సునీల్ కామెడీ నటన చూసి యంగ్ హీరోలే కాదు, సీనియర్ స్టార్స్ కూడా ఆశ్చర్యపోయారు. దాంతో సినిమా టైటిల్స్ మారాయేమే గానీ సునీల్ క్యారెక్టర్ మాత్రం మారలేదు. కమెడియన్ గా టాప్ లో ఉండగానే 'అందాలరాముడు'తో హీరో అయ్యాడు. 'మర్యాదరామన్న'తో మంచి హిట్ అందుకున్నాడు. ఇక సూపర్ సక్సెస్ ని టేస్ట్ చేసిన సునీల్ ఆ తర్వాత ఫుల్ టైం హీరోగా మారిపోయాడు. 'పూల రంగడు',' మిస్టర్ పెళ్లికొడుకు' లాంటి సినిమాలు చేశాడు. వీటిలో పూలరంగడు హిట్ అయినా, పెళ్లి కొడుకు మాత్రం ఆశించినంతగా కానుకలు తేలేకపోయాడు. దీంతో సునీల్ కెరీర్ కాస్త స్లో అయ్యింది.'బ్రహ్మానందం'.. ఈ పేరు వింటేనే ఎంతటి వారికైనా నవ్వొస్తుంది. ఇక బ్రహ్మి ఫేస్ చూస్తే చాలు ఎంత కొపంగా ఉన్నవాళ్లైనా నవ్వి తీరాల్సిందే. అదీ హాస్యానందం క్రెడిట్. సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఈ 'జిలేబి'లేకపోతే ఏదో మిస్సయిన ఫీలింగ్ ఉంటుందట. అందుకే సీనియర్ హీరోలు, యంగ్ స్టర్స్ అందరూ బ్రహ్మానందం ఉండాల్సిందే అంటుంటారు. తక్కువ బడ్జెట్ సినిమా అయినా బ్రహ్మానందం ఉంటే చాలా రిచ్ గా ఉంటుందట. అందుకే బ్రహ్మి కాల్షీట్ కొంచెం ఖరీదైనా ప్రొడ్యూసర్లు వెనకాడరట. ఎందుకంటే కామెడీ ఉంటే సినిమా సగం సక్సెస్, మరి ఆ హాస్యం హిట్ అవ్వాలంటే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఉండాల్సిందే. ఈ టాలీవుడ్ టాప్ కమెడియన్ కూడా హీరో గా మారాడు. 'బాబాయి హోటల్', 'లోఫర్ మామ సూపర్ అల్లుడు' లాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. బట్ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. దీంతో'జెఫ్పా'గా మారిపోయాడు. బాక్సాఫీస్ ని నవ్వుల్లో ముంచెత్తాలని డిసైడ్ అయ్యాడు. ఈ సినిమా రిజల్ట్ కూడా జెఫ్ఫా టైటిల్ కి తగ్గట్లే ఉండడంతో బ్రహ్మికి మరో బాక్సాఫీస్ షాక్ తగిలింది. ఇక హీరోగా లాభంలేదనుకొని, హీరోని చేసిన కామెడీకే ఫిక్స్ అయిపోయాడు బ్రహ్మానందం.
'ఆలీ'..ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. కమెడియన్ నుంచి హీరో గా ఎదిగిన నటుడు. హీరోగా 'అమ్మాయి కాపురం', 'అక్కుంబక్కుం', 'ఆవారా గాడు', 'యమలీల', 'పిట్టల దొర' ఇలా వరుసగా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నాడు. కానీ కథానాయకుడిగా కంటిన్యూ అవ్వలేకపోయాడు. హీరోగా వరస సినిమాలు చేసినవారెవరైనా, హీరోగానే కంటిన్యూ అవుతాడు. కానీ ఆలీ మాత్రం హీరో నుంచి కమెడియన్ కే షిఫ్ట్ అయ్యాడు.హీరోగా మధ్య మధ్యలో ఒకటీ అరా సినిమాలు చేస్తున్నాడు. కానీ లక్ తెచ్చిపెట్టిన కామెడీ క్యారెక్టర్స్ కే పరిమితం అయిపోయాడు.
'వేణుమాధవ్'.. ఓ ప్రత్యేక మానరిజమ్స్ తో డైనమిక్ కామెడీ చేస్తాడు . 'నల్లబాలు నల్ల త్రాచులెక్క నాకి చంపుతా'.. అంటూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి టాప్ కమెడియన్ అయ్యాడు. ఈ టాలీవుడ్'నవ్వులమాధవ్' కూడా హీరో అయ్యాడు. 'ప్రేమాభిషేకం'తో హీరో కమ్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఎంతో ఆర్భాటంగా హీరోగా మారి ప్రేమాభిషేకంని నిర్మించి, తన కెరీర్ ఫాల్ డౌన్ కి తానే పెట్టుబడిపెట్టుకున్నాడు. ఈ సినిమా ఫెయిల్యూర్ తో వేణు కెరీర్ మొత్తం డౌన్ అయ్యింది. అటు ఆర్థికంగా, ఇటు సినిమాల పరంగా నల్లబాలుకి అన్నీ కష్టాలే. ఇక లేటెస్ట్ గా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరో వయా డైరెక్టర్ గా మారాడు 'వెన్నెల కిషోర్'. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసి టాలీవుడ్ టాప్ కమెడియన్ గా మారాడు. 'డెబ్యూ' మూవీ 'వెన్నెల'నే ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్ ఆ తర్వాత టాప్ హీరోలతో కలిసి పంచ్ డైలాగ్స్ పేల్చాడు. హీరోలకు ధీటుగా యాక్ట్ చేసాడు. ఇక యంగ్ హీరోకి ఫ్రెండ్ గా యాక్ట్ చెయ్యాలంటే వెన్నెల కిషోరే పర్ఫెక్ట్ అనేలా ఓ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు. 'వెన్నెల-వన్ అండాఫ్', 'జఫ్ఫా' సినిమాలతో డైరెక్టర్ గా మారాడు.ఇంట్రడ్యూస్ అయిన సినిమాకి సీక్వెల్ గా తీసిన 'వెన్నెల వన్ అండాఫ్' కిషోర్ కి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బ్రహ్మానందం హీరోగా చేసిన 'జఫ్పా' రిజల్ట్ టైటిల్ కి తగ్గట్లే ఉంది. దాంతో వెన్నెల కిషోర్ డైరెక్షన్ కాస్త వెనకబడిపోయింది. ఇక రీసెంట్ గా 'అతడు ఆమె ఓ స్కూటర్'తో హీరోగా సక్సెస్ అందుకోవాలని పరుగులు పెట్టాడు. కానీ థియేటర్ల వద్ద మళ్లీ బోల్తా కొట్టాడు. ఇక వీరితో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, కమెడియన్ గా పాపులర్ అయ్యాడు 'కృష్ణభగవాన్'... 'జాన్ అప్పారావు 40ప్లస్', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' లాంటి సినిమాల్లో హీరోగా చేశాడు. అవి కాస్త ట్రాక్ మిస్ అవ్వడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్నాడు.
కమెడియన్స్ హీరోలుగా సక్సెస్ అవ్వలేరు అంటే అది ట్రాషే అవుతుంది. ఎందుకంటే సెంటిమెంట్స్ తో ఎవరూ హిట్ కొట్టలేరు, టాలెంట్ ఉంటేనే టాప్ ప్లేస్ కి వెళ్లగలరు. సో సెంటిమెంట్స్ కి ఆయింట్ మెంట్ రుద్దకుండా, హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ ఫేవర్ గా వస్తుంది అనే సక్సెస్ ఫార్ములాని ఫాలో అవుతూ.. సక్సెస్ దిశగా దూసుకుపోతూ.. కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయాలని కోరుకుంద్దాం..

No comments:
Post a Comment