హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి
నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 'టెన్ టివి'లో జరిగిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన విషయంలో స్పష్టత కొరవడిందన్నారు. రాజధానితోపాటు, నీరు, విద్యుత్, ఉద్యోగుల విషయంలో ఎలాంటి వివరణ ఇవ్వకుండానే నిర్ణయాలు తీసుకుందన్నారు. దీని వల్ల ఇరు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయన్నారు. తమ పార్టీ విధానం ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో చిన్న రాష్ట్రాల డిమాండ్ ఉందని, ఇది దేశ సమైక్యతకు మంచిది కాదన్నారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరుగుతుందని చెప్పారు.
వామపక్షాలతోనే 'ప్రత్యామ్నాయం..'
దేశంలో వామపక్షాలతోనే ప్రత్యామ్నాయ ప్రభుత్వం సాధ్యమవుతుందని ఏచూరి అన్నారు. గతంలో ఏర్పడిన థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలన్నీ వామపక్షాల వల్లే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పార్టీలకంటే, విధాన పరమైన ప్రత్యామ్నాయంతో కూడిన ప్రభుత్వం దేశానికి అవసరమన్నారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించే విధానాలు వామపక్షాల వద్ద ఉన్నాయన్నారు. అయితే.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఎన్నికల ముందా..? తర్వాతా..? అన్న విషయం ఇప్పుడే తెలియదన్నారు.
విధానాల్లో రెండూ రెండే...
ఆర్థిక, రాజకీయ విధానాల్లో కాంగ్రెస్, బిజెపి రెండూ రెండేనని ఏచూరి చెప్పారు. ఒక్క మతోన్మాదం మినహాయిస్తే రెండు పార్టీలకు ఎందులోనూ తేడాలేదన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా రాజకీయంగా లాభపడాలని రెండు పార్టీలూ భావిస్తున్నాయన్నారు. అందుకే పార్లమెంట్ లో బిల్లుకు మద్దతు తెలిపేందుకు ఇద్దరూ సిద్ధమయ్యారని చెప్పారు. దీన్ని అడ్డుకోవడం ఎవరివల్లా కాదని స్పష్టం చేశారు.
లోపాలు సవరించుకుంటున్నాం...
దేశంలో వామపక్షాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, అయితే.. వాటి పాఠాలు తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. బెంగాల్ లో తృణమూల్ హింసా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో 4,700 బూత్ లలో రిగ్గింగ్ చేసి, తృణమూల్ అరాచకాలు సృష్టించిందన్నారు. 24 మంది సీపీఎం కార్యకర్తలను హతమార్చిందన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం తమ పార్టీ ప్రాణత్యాగాలు సైతం చేస్తోందన్నారు.
ప్రజాచైతన్యమే మార్గం...
దేశంలో, రాష్ట్రంలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ప్రజలు చైతన్యవంతులవ్వడమే మార్గమన్నారు. రెండు ప్రాంతాల్లో కొందరు రాజకీయ నేతల స్వార్థంతో ఆందోళనలు రెచ్చగొడుతున్నారని చెప్పారు. వీటిని పూర్తిగా అర్థం చేసుకుని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించి, సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. దోపిడీలేని సమాజమే సీపీఎం లక్ష్యమని, అందుకోసం ప్రజలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు సీతారాం ఏచూరి సమాధానాలిచ్చారు.
నెల్లూరు, మోహన్ కృష్ణ : రాష్ట్రం రెండు ముక్కలు చేశారు కదా ? ఎలా న్యాయం చేస్తారు.
న్యాయం తప్పకుండా చేయాలి. ఏ విధంగా న్యాయం చేయాలో పాలకులు నిర్ణయిస్తారు. నిర్ణయం వచ్చినప్పుడు కరెక్టా ? కాదా ? అనేది తప్పకుండా చెబుతాం. ముందు వాళ్ళని చెప్పనీయండి..
కడప, సూర్యనారాయణ : దేశంలో జాతీయ భావాలుగల వ్యక్తులు ప్రధానులుగా లేకపోవడం వల్లే ఇలాంటి విభజన సమస్యలు వస్తున్నాయా ?
ఇది కూడా ఒక కారణం కావచ్చు. పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి జాతీయ భావాలు లేవని చెప్పడం భావ్యం కాదు. జాతీయ భావం ఉన్నా, ఎన్నికల్లో లాభాల కోసం చేసే కొన్ని నిర్ణయాల వల్ల దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆలోచించలేదు. ఇదే మా విమర్శ.
వెలుగోడు, నాగేందర్ : సమైక్య వాదంపై మీ అభిప్రాయం
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగా ఉన్నప్పటి నుంచే దీనిపై మాకు స్పష్టత ఉంది. భాషా ప్రయుక్తంగా ఏర్పడ్డ రాష్ట్రాలను విడగొట్ట వద్దు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. సిద్ధాంత పరంగా సిపిఎం ఈ స్పష్టత ఎప్పుడో ఇచ్చింది. అయినప్పటికీ గతంలో బిజెపి ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలను విడగొట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసింది. భాషా ప్రయుక్తం అనే ఆధారం లేకపోతే సమస్యలు ఆగవని మేము చెబుతూ వస్తున్నాం. దురదృష్ట వశాత్తు అదే రుజువవుతోంది కూడా. ఇప్పుడు డార్జిలింగ్ లో హింసాకాండ జరుగుతోంది. బోడోలాండ్, అస్పాంలో బంద్ ఇవన్నీ ఇందులో భాగమే. ఇది దేశప్రజల మధ్య ఐక్యతకు, సమైక్యతకు మంచిది కాదు.
హనుమాన్ జంక్షన్, శ్రీనివాస్: కాంగ్రెస్ పార్టీ మన రాష్ర్టాన్ని ముక్కలు చెక్కలు చేస్తూ వస్తోంది. దీనివల్ల తీవ్రంగా మనస్థాపం చెందాం. దీనిపై మీ పార్టీ నుంచి స్పష్టత కావాలి.
ఈ దేశంలో కాంగ్రెస్, బిజెపి నిర్ణయం తీసుకుంటే ఏమి చేయలేం. పార్లమెంట్ లో వాళ్లకు సంఖ్యాపరంగా మెజార్టీ ఉంది. మా పార్టీ స్పష్టత గురించి ఇంతకు ముందే చెప్పాను. మా అభిప్రాయం చెప్పినప్పటికీ దీని మీద ఎలాంటి ప్రభావం చూపదు.
పశ్చిమ గోదావరి, శ్రీనివాస్ : తెలంగాణ ఇవ్వడం వల్ల నక్సలిజం పెరుగుతుందని, కార్పొరేట్లు ప్రజలను పీడించే ప్రమాదం పెరుగుతందనే అభిప్రాయం వస్తోంది. మీరేమనుకుంటున్నారు?
విభజన అయిన కాకపోయినా సమస్య వస్తుంది. పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలి. వేరే దారి లేదు.
అనంతపురం, శ్రీనివాస్ : కార్మికవర్గం ఇబ్బందుల్లో ఉంది. ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం సమైక్యం, ప్రత్యేకం పేరుతో ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సిపిఎం ఎలాంటి పోరాటం చేయనుందో తెలపండి.
ప్రస్తుతం హైదరబాద్ లో ఉండడానికి ఇదే కారణం. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నాను. ప్రజల మీద పడుతున్న భారాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. పోరాటాలు చేయాలి. ఇలాంటి పోరాటాలను బలపర్చాలి.
హైదరాబాద్, మూర్తి : ప్రత్యామ్నాయ వల్లే ప్రభుత్వం ఏర్పడుతుంది. విధానాల వల్ల ప్రభుత్వం ఏర్పడుతుంది. తేడాలు
విధానాలపై ప్రభుత్వం ఏర్పడితే బాగుంటుంది. ఒక కామన్ ప్రోగ్రాం ఉంటుంది. ఎన్నికల తరువాతే వస్తుందని అనుకుంటున్నాం.
కర్నూలు అల్బర్ట్ : మీరు ఎప్పుడు ప్రధాన మంత్రి అవుతారు.
మీ చేతుల్లో ఉంది. ప్రజలు ఎప్పుడు నిర్ణయిస్తారో అప్పుడు అవుతారు.
కదిరి, నర్సింహ : తెలంగాణ రాష్ట్రం ప్రకటించం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రస్తుతం విభజన చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా నాన్చుతు ఉన్న ఈ సమస్యను ఎన్నికల తరుణంలో ప్రకటించారు.
మహబూబ్ నగర్, బాల్ రెడ్డి : ప్రత్యామ్నాయ విధానాలతో తృతీయ ఫ్రంట్ అని సిపిఎం చెబుతోంది. కానీ వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలు ప్రధాన మంత్రి పదవి లక్ష్యంగా ఆలోచిస్తున్నాయి. మీరు ఎలాంటి వైఖరి తీసుకోబోతున్నారు?
ప్రాంతీయ పార్టీలు వారు అధికారంలోకి ఎలా రావాలి, ఏ పదవి దక్కించుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయ విధానాల గురించి ఆలోచించిన తరువాతే ముందుకు రావాలని సిపిఎం చెబుతోంది. దీనికోసం కృషి జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచే ఈ ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాం. ఎన్నికల తరువాతే దీనిపై సష్టమైన అవగాహన వస్తుంది.
నెల్లూరు, మహేష్ రెడ్డి : సమైక్యాంధ్రకు మద్ధతుగా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయి. దీనికి మార్క్సిస్టు పార్టీ మద్ధతు ఎందుకు ఇవ్వడం లేదు.
ఈ విధంగా ఘర్షణలు పెంచడం వల్ల ఎవరికి లాభాలు రావు. రెండు ముఖ్యమైన పార్టీల నేతలు వారికే వారే ప్రతిపక్షం లాగా వ్యవహరిస్తున్నారు. ఘర్షణలు పెంచుతున్నారు. చివరకు నష్టపోతున్నది ప్రజలే.
హైదరాబాద్, ప్రసాద్ : విభజన, సమైక్యం పరిష్కారం ఎప్పుడు?
అదే చెబుతున్నాం. ఘర్షణలు పెంచడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. పాలకవర్గాలు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి.
భీమవరం, వరుణ్ : సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎందుకు చేయరు అని ఇప్పుడు పార్టీ, ప్రజాసంఘాల వారిని ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై మీరేమంటారు?
ఈ రకంగా ఘర్షణలు పెంచడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. వాస్తవికంగా నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షం మద్ధతు తెలిపింది. పార్లమెంటులో మిగిలిన వారు ఏ నిర్ణయం తీసుకున్నా పాలకపార్టీ నిర్ణయం అమలు జరిగిపోతుంది. దురదృష్టవశాత్తు ఇంతకంటే మించి ఏమీ జరగదు. దీనిని అర్థం చేసుకోవాలి. ఈ అవగాహనతోనే ముందుకు వెళ్లాలి.
కర్నూలు, విశ్వేశ్వర్ రెడ్డి : 20ఏళ్ల తరువాత సిపిఎం పార్టీ ఉనికిలో లేకుండా పోతోంది. మీరు విధానాలు మార్చుకుంటారా? ఏం చేయబోతున్నారు?
పని చేసే వారు తప్పులు చేస్తుంటారు. పనే చేయని వారు తప్పులు చేసేందుకు అవకాశమే లేదు. కాబట్టి పని చేసే వారు తప్పులు సరిదిద్దుకుంటూ పోవాలి. ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం. కమ్యూనిస్టు పార్టీ దిగజారడం లేదు. పశ్చిమ బెంగాల్ లో ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నామో తెలిసిందే. అక్కడ మార్పు కోరుకున్నారు అంతే. త్రిపుర, కేరళలో విజయాలు సాధించాం. కాబట్టి మీరు చెప్పేది సరికాదు.
విశాఖ, ధనుంజయ్ : ఒక్క బెంగాల్ వరకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు. దేశం మొత్తం ఎందుకు విస్తరించబడలేదు? కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మీరెందుకు గట్టిగా ఖండించలేదు?
నేను మీ రెండో ప్రశ్న నుంచి వస్తాను. కాంగ్రెస్, బిజెపి కలిస్తే మేము ఎంత అరిచినా ఏమి లాభం లేదు. పార్లమెంట్ లో వారికి ఆ విధంగా మెజార్టీ ఉంది. ఇక మొదటి ప్రశ్న గురించి ఒక్క బెంగాల్ వరకే సిపిఎం పరిమితం కాలేదు. గతంలో అందరికంటే ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలిచింది ఆంధ్రప్రదేశ్. ఈ చరిత్ర కొద్ది మంది మరిచి పోతుంటారు. ఏ విధంగా అయితే కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పెరగాలో అలా పెరగలేదు. దానికోసం మేము కృషి చేస్తున్నాం.

No comments:
Post a Comment