పవన్ కళ్యాణ్.. తన అభిమానులకోసం ఏదైనా చేస్తాడు. తన గత చిత్రాల్లో బిట్ సాంగ్స్ ఆలపించి అలరించిన పవర్ స్టార్.. తాజాగా వస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రంలోనూ ఓ పాట పాడారు. ఆడియో ఆల్బమ్ లో లేని ఈ పాట.
. ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే టీజర్స్ తోపాటు, ఆడియో సూపర్ సక్సెస్ కాగా.. రీసెంట్ గా విడుదల చేసిన 'పవర్ సాంగ్' దుమ్ము లేపుతోంది. ''కాటం రాయుడా.. కదిరీ నర్సింహుడా...'' అంటూ సాగే పాట ఉర్రూతలూగిస్తోంది. పాట పాడే సమయంలో 'పవర్ స్టార్' చేసిన హంగామా, స్టెప్పులు పాటకు మరింత ఊపు తెచ్చాయి. చిత్ర సంగీత దర్శకుడు 'దేవి శ్రీ ప్రసాద్' పట్టుబట్టడంతో'పవన్' ఈ పాట పాడారని తెలుస్తోంది. 'పవన్' పాడిన ఈ పాట చాలా కొత్తగా ఉందని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో 'ఖుషి', 'తమ్ముడు' 'గుడుంబా శంకర్' చిత్రాల్లో పవన్ బిట్ సాంగ్స్ ఆలపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా సినిమాలోనూ పవన్ గొంతు సవరించడంతో అభిమానులు స్టెప్పులేస్తున్నారు. మరి.. ఈ సాంగ్ సినిమాకు ఎంత వరకూ ప్లస్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు9 వరకూ ఆగాల్సిందే..
No comments:
Post a Comment